జగన్ ను ఆ భయం వెంటాడుతోందా ?

ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి( AP CM Jaganmohan Reddy ) వచ్చే ఎన్నికల్లో విజయం పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేస్తున్నామని( Implementation of welfare schemes in AP ), తాము అమలు చేస్తున్న సంక్షేమమే తమను గెలిపిస్తాయని, అందుకే తాము ఎలాంటి పొత్తులకు వెళ్ళేది లేదని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని సి‌ఎం జగన్ పదే పదే చెబుతున్నారు.

 Is Jagan Afraid Of Victory Details, Ap News,ap Political News,jagan,ap Cm Jagan,-TeluguStop.com

ప్రస్తుతం ఏపీలో అమలౌతున్న చాలా పథకాలకు లభ్ది దారుల సంఖ్య చాలానే ఉంది.వారంతా కూడా వైసీపీ ( YCP party ) కి అండగా నిలిచిన గెలుపు ఈజీ అనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.

అందుకే గెలుపు విషయంలో పూర్తి ధీమాతో ఉన్నారు.

Telugu Ap Assembly, Ap Cm Jagan, Ap, Jagan, Jaganafraid, Ys Jagan-Politics

అయితే ప్రస్తుతం ఆయనను ఒక భయం వెంటాడుతోంది.కేంద్రం అమలు చేస్తున్న చాలా పథకాలకు జగన్ పేరు పెట్టుకొని లబ్ది పొంచే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది.బీజేపీ నేతలు కూడా ఇదే అంశాపై జగన్ వైపు వేలెత్తి చూపుతున్నారు.

ఆ మద్య ఏపీ వచ్చిన అమిత్ షా కూడా ఇదే విధమైన విమర్శలు గుప్పించారు.జగన్ అమలు చేస్తున్నవేవీ లేవని.అన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు పెట్టుకున్నారని.ఇలా చేయడానికి సిగ్గుందా అంటూ జగన్ ను ప్రశ్నించారు అమిత్ షా.ఇదే భావన ప్రజల్లోనూ కలిగితే.వచ్చే ఎన్నికల్లో జగన్ ను నమ్మే అవకాశాలు చాలా తక్కువ.

అందుకే ఈ భావన ప్రజల్లో కలగకుండా ఉండాలంటే ముందస్తు ఎన్నికల మార్గమని జగన్ భావిస్తున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Telugu Ap Assembly, Ap Cm Jagan, Ap, Jagan, Jaganafraid, Ys Jagan-Politics

సాధారణంగా వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) జరగనున్నాయి.ఈ రెండు ఎన్నికలు ఒకే సారి జరగడం వల్ల.ప్రచారంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రస్తావించాల్సి రావోచ్చు.

అది జగన్ కు మైనస్ గా మారే అవకాశం ఉంది.అందుకే పార్లమెంట్ ఎన్నికలకు ఐదు నెలలల ముందు ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తే.

తాము అమలు చేస్తున్న పథకాలను కాన్ఫిడెంట్ గా ప్రజల్లో వినిపించవచ్చు.అందుకే ఈ ఏడాది చివర్లో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఏపీ కూడా ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని ఇప్పటికే వైఎస్ జగన్ చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు.కానీ కేద్ర ప్రభుత్వ పథకాల విషయంలో వెంటాడుతున్న భయంతోనే ఆయన ముందస్తుకు వెళ్ళాక తప్పదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube