Kangana Ranauth: కంగనా వచ్చినప్పుడు మా నివాసంలో జరిగింది అదే.. జావెద్ కామెంట్స్ వైరల్?

బాలీవుడ్ నటి కాంట్రవర్సీ క్వీన్  కంగనా రనౌత్‌ ( Kangana Ranauth )గురించి పరిచయం అక్కర్లేదు.తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

 Javed Akhtar Breaks Silence On What Happened At His House Meeting With Kangana-TeluguStop.com

ఒకవైపు వార్తల్లో నిలుస్తూనే మరొకవైపు వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది కంగనా.ఇది ఇలా ఉంటే కంగనా రనౌత్‌ ప్రముఖ సినీ రచయిత జావేద్‌ అక్తర్‌కు( Javed Akhtar ) మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.2016లో జావేద్‌ ఇంటికి ఆహ్వానించి, తనని బెదిరించాడని కంగనా రనౌత్‌ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.వాటిని జావేద్‌ ఖండించారు.

Telugu Hrithik Roshan, Javed Akhtar, Kangana Ranaut-Movie

ఆమెపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు.ఈ నేపథ్యంలోనే తాజాగా అందేరీ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌( Metropolitan Magistrate ) కోర్టుకు హాజరైన జావేద్‌ ఆనాడు తన నివాసంలో ఏం జరిగిందో కోర్టుకు తెలియజేశారు.హృతిక్‌ రోషన్‌, కంగనా రనౌత్‌ కు మధ్య నెలకొన్న వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికే ఆ రోజు ఇంటికి పిలిపించాను.కంగనా రనౌత్‌ తో నాకు పెద్దగా పరిచయం లేదు.

నా స్నేహితుడు రమేశ్‌ అగర్వాల్‌కు ఆమె బాగా తెలుసు.హృతిక్‌తో ఆమెకు గొడవలు ఉన్నప్పుడు వాటిని సద్దుమణిగేలా చేయాలనే ఉద్దేశంతో రమేశ్‌ ఆమెకు ఫోన్‌ చేసి మా ఇంటికి రమ్మని తెలిపారు.

Telugu Hrithik Roshan, Javed Akhtar, Kangana Ranaut-Movie

దాంతో ఆమె తన సోదరి రంగోలీని తీసుకుని మా ఇంటికి వచ్చారు.మేం నచ్చజెప్పడానికి ప్రయత్నించినా కంగన వినాలనుకోలేదు.దాంతో ఆమె మా ఇంటి నుంచి వెళ్లిపోయింది.ఆమె మనసును ఇబ్బంది పెట్టేలా మేమేం మాట్లాడలేదు అని జావేద్‌ కోర్టుకు తెలియజేశారు.ఇకపోతే కంగాన రనౌత్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్( Hrithik Roshan ) గతంలో రిలేషన్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.కాగా కొన్ని అనివార్య కారణాలతో వీరు విడిపోయారు.

ఈ క్రమంలోనే హృతిక్‌ తనని మోసం చేశాడంటూ కంగన తీవ్ర ఆరోపణలు చేశారు.దాంతో వారిద్దరి వ్యవహారం కోర్టు దాకా చేరుకుంది.

ఈ నేపథ్యంలోనే 2020లో ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా రనౌత్‌ హృతిక్‌తో గొడవ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అదే సమయంలో జావేద్‌ తనను ఇంటికి పిలిచి మరీ బెదిరించాడని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube