రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో కేటీఆర్( K.T.Rama Rao ) పర్యటన లో భాగంగా రైతు రుణమాఫీ, ఎల్లారెడ్డిపేట( Yellareddypet ( మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తక్షణమే ఏర్పాటు చేయాలని, వడ్ల కొనుగోలు డబ్బులు సకాలం లో రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ ను అడ్డుకున్న బీజేవైఎం నాయకులు.
కేటీఆర్ కాన్వాయ్ ఎదురుగా వెళ్లిన బీజేవైఎం మండల అధ్యక్షులు జితేందర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ సోషల్ మీడియా కన్వినర్ మాలోత్ సాయి కిరణ్ నాయక్, బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ ప్రకాష్ లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.







