మార్‌వెల్( Marvel ) సినిమాల్లో అతీత శక్తులు కలిగినవారు ఆకాశంలో ఎగరడం, పెద్ద పెద్ద బిల్డింగ్‌లు సనాయాసంగా ఎక్కడం లాంటివి చూసి ఉంటాం.స్పైడర్ మ్యాన్ సినిమాలో అయితే హీరో బిల్డింగ్‌లపైన శత్రువులతో పోరాటాలు చేస్తూ ఉంటాడు.
సేమ్ సినిమాల్లో తరహా సీన్ ఇప్పుడు రియల్ లైఫ్‌లో చోటుచేసుకుంది.ఒక వ్యక్తి ఏకంగా 123 ఫోర్ల బిల్డింగ్‌పైకి సగం ఎక్కాడు.
ఎలాంటి తాళ్లు లేకుండానే ఎక్కేశాడు.అయితే చివరికి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

దక్షిణ కొరియాలోని సియోల్‌లో( Seoul, South Korea ) ఈ ఘటన చోటుచేసుకుంది.ఒక వ్యక్తి సియోల్ లోని లొట్టే వరల్డ్ టవర్ పైకి ఎక్కేశాడు.123 ఫోర్లతో ఈ టవర్ ఉంటుంది.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌గా దీనికి పేరుంది.24 ఏళ్ల బ్రిటిష్ యువకుడు ఈ బిల్డింగ్ పైకి ఎక్కాడు.దాదాపు 73 అంతస్తుల వరకు ఎక్కాడు.
అయితే స్థానికుల సమాచారంతో పోలీసులు బిల్డింగ్ వద్దకు చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.ప్రమాదకర విన్యాసాలు చేస్తుండటంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని ( Firefighters )పిలిపించి అతడిని కిందకు దించారు.అనంతరం అతడిని నిర్బంధించారు.యువకుడిని బ్రిటన్‌కు చెందిన జార్డ్ కింగ్ థాంప్సన్ గా గుర్తించారు.2019లో ఒకసారి ఇదే వ్యక్తి బిల్డింగ్ ఎక్కినట్లు పోలీసుల విచారణలో తేలింది.గతంలో బిల్డింగ్ ఎక్కినందుకు అతడిపై కేసు నమోదైంది.2018లో కూడా లోట్టే వరల్ట్ టవల్ ఎక్కే ప్రయత్నం చేశాడు.దీంతో అప్పుల్లో కూడా పోలీసులు గమనించి అరెస్ట్ చేశారు.ఇప్పుడు అతడిని అరెస్ట్ చేయడం మూడోసారి.అతడు బిల్డింగ్ లు ఎందుకు ఎక్కుతున్నాడనేది అర్ధం కావడం లేదు.సాహసాలు చేయడం అతడికి ఇష్టమని, అందుకే ఎత్తైన బిల్డింగ్‌లు ఎక్కుతున్నట్లు చెబుతున్నారు.







