వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో జరిగిన శిరీషా హత్య కేసును పోలీసులు ఛేదించారు.శిరీషాను ఆమె బావ అనిల్, అతని స్నేహితుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.ఇందులో భాగంగా శిరీషాను ఆమె బావనే అంతమొందించినట్లు గుర్తించారు.
మద్యం మత్తులో హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.ఊరి శివారులో ఉన్న మైసమ్మ గుడి వద్ద బీర్ సీసా పగలకొట్టిన అనిల్ ఫ్రెండ్ శిరీషా కళ్లలో గుచ్చాడని పోలీసులు తెలిపారు.
అనంతరం మోకాలు లోతు నీళ్లున్న కుంటలో పడేసి ఆమె చనిపోయే వరకు శిరీషాపై అనిల్ ఫ్రెండ్ నిల్చున్నాడని పేర్కొన్నారు.చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత ఆనవాళ్లు మాయం చేసిన ఇద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోయారని వెల్లడించారు.







