బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎవ‌రిని ఎలా వేధించాడంటే

రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై( Brij Bhushan against Saran Singh ) లైంగిక వేధింపుల ఫిర్యాదుపై దాఖలైన కేసుల వివరాలు తెరపైకి వచ్చాయి.రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ( Connaught Place, Delhi )పోలీస్ స్టేషన్‌లో బీజేపీ ఎంపీపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

 How Brij Bhushan Sharan Singh Molested Someone , Brij Bhushan Sharan Singh, Conn-TeluguStop.com

ఇందులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి.అనుచితంగా తాకడం, తొడలపై చేతులు వేసి నొక్క‌డం, బలవంతంగా కౌగిలించుకోవడం వంటి ఆరోపణలు రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిపై ఉన్నాయి.

ఏప్రిల్ 21న బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై ఏడుగురు రెజ్లర్లు ఫిర్యాదు చేశారు.ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 28న రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

Telugu Brijbhushan, Place, Delhi-Latest News - Telugu

మొదటి రెజ్లర్ ఫిర్యాదు FIR ప్రకారం హోటల్ రెస్టారెంట్‌లో విందు సమయంలో బ్రిజ్ భూషణ్ నన్ను తన టేబుల్ ద‌గ్గ‌ర‌కు పిలిచాడని ఒక రెజ్లర్ ఆరోపించాడు.ఛాతీ నుండి పొట్ట వరకు నన్ను తాకారు.రెజ్లింగ్ ఫెడరేషన్ కార్యాలయంలో నా అనుమతి లేకుండా నా మోకాళ్లు, భుజాలు మరియు అరచేతులను తాకారు.మేం కూర్చున్నప్పుడు తన పాదాలతో నా పాదాలను తాకుతున్నాడని రెజ్లర్ ఆరోపించాడు.

మరో రెజ్లర్ ఫిర్యాదు బీజేపీ ( BJP )ఎంపీపై మరో రెజ్లర్ కూడా ఆరోపణలు చేశారు.నేను చాప మీద పడుకున్నప్పుడు నిందితుడు నా దగ్గరకు వచ్చాడ‌ని ఆమె ఆరోపించారు.

అతను నా అనుమతి లేకుండా నా టీ షర్ట్ లాగాడు.నా మీద చేయి వేసి నా ఛాతీని, పొట్టను తాకాడు.

ఫెడరేషన్ ఆఫీస్ రూమ్‌లో తనను బలవంతంగా తనవైపు లాక్కునేందుకు ప్రయత్నించాడని రెజ్లర్ ఆరోపించాడు.

Telugu Brijbhushan, Place, Delhi-Latest News - Telugu

మూడో రెజ్లర్ ఫిర్యాదు ఆ సమయంలో నా దగ్గర ఫోన్ లేదని మూడో రెజ్లర్ ఆరోపించారు.బ్రిజ్ భూషణ్ నన్ను మా తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడేలా చేశాడు.అప్పుడు అతను నన్ను తన మంచం వైపున‌కు పిలిచాడు హఠాత్తుగా నన్ను కౌగిలించుకున్నాడు.

నాకు లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నించాడు.నాల్గవ రెజ్లర్ ఫిర్యాదు బ్రిజ్‌భూషణ్ సింగ్ తన చేయి నా కడుపు కిందకు పెట్టాడ‌ని నాల్గ‌వ‌ రెజ్లర్ ఆరోపించారు.

నా ఊపిరిని చెక్ చేయాలన్న సాకుతో నా బొడ్డుపై చేయి వేశారు.ఐదవ రెజ్లర్ ఫిర్యాదు నేను లైన్ వెనుక ఉన్నానని ఐదవ రెజ్లర్ ఆరోపించాడు.

అప్పుడు అతను నన్ను అనుచితంగా తాకాడు.నేను దూరంగా వెళ్ళడం ప్రారంభించినప్పుడు, అతను నా భుజం పట్టుకున్నాడు.

ఆరో రెజ్లర్ ఫిర్యాదుఆరో రెజ్లర్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఫొటోను తీయాలనే నెపంతో భుజంపై చేయి వేసుకున్నాడని ఆరోపించాడు.నేను దానిని వ్యతిరేకించాన‌ని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube