నెల్లూరు జిల్లాలోని రాపూరు సమీపంలో ప్రమాదం జరిగింది.ప్రమాదవశాత్తు అదుపుతప్పిన ఆటో కండలేరు సాయిగంగ కాలువలోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా మరొకరు క్షేమంగా బయటపడ్డారు.సైదాపురం మండలం కలిచేడుకు చెందిన భార్యాభర్తలు దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
భార్య మృతి చెందగా.భర్త క్షేమంగా బయటపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆటోను బయటకు తీశారు.