Apsara Sai Krishna: బ్రాహ్మణ యువకుడిపై పెట్టిన తప్పుడు కేసు ఎత్తివేయాలి’ అని ర్యాలీ తీస్తారు రేపో మాపో !

ఏ పాపం చేశావమ్మా .ఇక్కడ పుట్టావ్… ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది పరిచయం ఉంటె చాలు ఆమె చావుకు లేదా ముక్కలు ముక్కలు చేసి చంపి డ్రైనేజ్ లో వేయడానికి అర్హురాలు అయిపోతుందా ? మమ్మల్ని క్షమించు తల్లి మేము నిన్ను కాపాడుకోలేకపోయాం.ఎందుకంటే నువ్వు నీచమైన కులం అనే కుష్టి వ్యాధి ఉన్న ఈ సమాజంలో పుట్టావ్ కాబట్టి.కనీసం నీ చావు చూసైనా ఎవరికీ మానవత్వం కలగడం లేదు.

 Poojari Sai Krishna Apsara Case Latest News-TeluguStop.com

నీ కాంటాక్ట్ లిస్ట్ లో ఎన్ని మేల్ నంబర్స్ ఉన్నాయో తీస్తున్న దుస్థితి.ఆఖరికి పాలు పోసేవాడు మొగవాడైన సరే ఆ అమ్మాయి ఇంటికి రోజు పాలవాడు వెళ్తాడు అండి అనే దారుణమైన సంస్కృతి.

Telugu Apsara, Brahmin, Hyderabad, Relationship, Latest, Poojarisai, Sai Krishna

సమాజ సేవ చేస్తాడు, గుడిలో నిత్యం అభిలేషేకం చేసాడు, నిత్యాన్నదానం చేస్తాడు కాబట్టి మొగవాడు మంచి వాడు అయిపోయాడు.పైగా అతడు ఒక బ్రాహ్మణ వ్యక్తి.( Brahmin ) నువ్వు హిందూ.అందుకే నువ్వు చంపబడటానికి అర్హత సంపాదించుకున్నావ్.పెళ్ళై కూతురు ఉన్న సరే అతను నీతో అక్రమ సంబంధం( Illegal Relationship ) కలిగి ఉండవచ్చు.గర్భం వస్తే అబార్షన్ చూపించవచ్చు.

కానీ పెళ్లి అంటే చంపేస్తాడు.ఎలాగైనా నిన్ను వాడుకునే హక్కు ఆ వ్యక్తి ఉంది కానీ పెళ్లి చేసుకొమ్మని అడిగే హక్కు నీకు లేదు.

అందుకే వెంట పడింది.టార్చర్ చేసింది .అందుకే చంపేసి కప్పెటేసాను అంటూ నీతులు చెప్తున్నాడు ఒక నీచుడు ఈ రోజు.ఇప్పుడు మాత్రమే కాదు తరతరాలుగా ఆడవారి పై ముఖ్యంగా విక్టిమ్ పై ఇలాంటి నిందలు వేస్తూనే ఉన్నారు.

Telugu Apsara, Brahmin, Hyderabad, Relationship, Latest, Poojarisai, Sai Krishna

అప్సర ( Apsara ) అంత టార్చర్ చేస్తుంటే మహా ఉత్తముడు అయినా ఆ పూజారి ఎందుకు పోలీస్ స్టేషన్ కి లేదా మహిళా సంఘాలకు వెళ్ళలేదు.పెద్దల వరకు కూడా చెప్పకుండా ఏకముగా లాంగ్ డ్రైవ్ అని చెప్పి చంపేసి శవాన్ని కార్లోనే తెస్తాడు.ఇక మీరు చూస్తూనే ఉండండి.ఈ మీడియా మరియు కొన్ని సంఘాలు అన్ని కలిసి తప్పుడు కేసులు పెట్టిన బ్రాహ్మణ యువకుడిని తక్షణమే విడుదల చేయాలి అంటూ ర్యాలీ లు తీసిన ఆశ్చర్య పోనక్కర్లేదు.

ఇలాంటి సంఘటనలు మళ్లి జరిగితే ఆడవాళ్లను గుడికి కూడా వెళ్లనివ్వరు కొందరు మృగాలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube