మహానటి సినిమా(Mahanati) ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కీర్తి సురేష్(Keerthy Suresh) ప్రస్తుతం తెలుగు తమిళ భాషలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా మెహర్ రమేష్(Mehar Ramesh) దర్శకత్వంలో రాబోతున్న భోళా శంకర్ సినిమా(Bhola Shankar Movie) లో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు హైదరాబాదులో జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే నటి కీర్తి సురేష్ హైదరాబాదులో సందడి చేస్తున్నారు.

ఇలా నగరంలో పర్యటిస్తున్నటువంటి ఈమె హైదరాబాద్లోని గచ్చిబౌలిలో రోడ్డు పక్కన ఉన్నటువంటి వరలక్ష్మి టిఫిన్ సెంటర్ (Tiffin Center) కు తన స్నేహితులతో పాటు కలిసి వచ్చారు.ఇక్కడ తందూరి టీని తాగి తన స్నేహితులతో కలిసి ఎంతో ఎంజాయ్ చేశారు అయితే బయట తనని ఎవరు గుర్తుపట్టకుండా కీర్తి సురేష్ మొహానికి మాస్క్ వేసుకున్నారు.ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాతో పాటు ఈమె తమిళంలో ఉదయ నిధి స్టాలిన్ నటించిన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇకపోతే ఈమె చివరిగా నాని హీరోగా నటించిన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇందులో కీర్తి సురేష్ డి గ్లామర్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారని చెప్పాలి ఇలా దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి కీర్తి సురేష్ ఎంతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.ప్రస్తుతం ఈమె భోళా శంకర్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన నటి తమన్న(Thamannah) నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.







