ఇటీవలే వాట్సప్ అప్డేట్ ఫీచర్( WhatsApp update ) పేరిట లింకులు రావడం పెరిగిపోయింది.పొరపాటున ఈ లింక్ లపై క్లిక్ చేస్తే స్మార్ట్ ఫోన్లో ఉండే సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళుతుంది.
ఫోన్ హ్యాక్ చేయబడుతుంది.ఈ మధ్యన వాట్సప్ అప్డేట్ అవుతూ సరికొత్త ఫీచర్లు వస్తున్న క్రమంలో సైబర్ నెరగాళ్లు వాట్సాప్ ను టార్గెట్ చేస్తూ అమాయకులను బురిడీ కొట్టించేందుకు అన్ని దారులను తెరిచి ఉంచుతున్నారు.
కాబట్టి అనవసర లింకులపై క్లిక్ చేయకండి.సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకండి.
వాట్సప్ అనేది ఆకుపచ్చ రంగులో ఉంటుంది అన్న విషయం స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి తెలుసు.అయితే సైబర్ నేరగాళ్లు వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ పింక్ రంగులో వచ్చిందంటూ లింక్ పంపించి బురిడీ కొట్టిస్తున్నారు.

సైబర్ క్రైమ్ ( Cyber crime )పోలీసులు ఈ పింక్ వాట్సాప్ సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసం అంటూ హెచ్చరిస్తున్నారు.సాధారణ ఎస్ఎంఎస్, వాట్సప్ లలో ఈ పింక్ వాట్సప్ లింక్ లు సైబర్ నేరగాళ్లు పంపిస్తున్నారని తెలిపారు.వాట్సప్ అప్డేట్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేస్తే ముందుగా ఫోన్ నెంబర్, తర్వాత ఓటిపి లాంటివి ఎంటర్ చేస్తే స్మార్ట్ ఫోన్లో ఉండే పర్సనల్ ఫోటోలు, కాంటాక్ట్ నెంబర్లు, బ్యాంక్ పాస్వర్డ్ లాంటి వివరాలు అన్ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసేస్తారు.

కాబట్టి వాట్సప్ మాత్రం ఈ పింక్ వాట్సాప్ (Pink WhatsApp )ను అప్డేట్ చేయలేదు.ఎవరి స్మార్ట్ ఫోన్లో నైనా ఈ పింక్ వాట్సప్ ఉంటే వెంటనే ఆన్ ఇన్స్టాల్ చేసేయండి.ఎందుకంటే అన్ ఇన్స్టాల్ చేసుకుంటే నకిలీ లింకులను షేర్ కాకుండా ఆపవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
ఒకవేళ మనకు తెలిసినవారు ఎవరైనా ఈ పింక్ వాట్సప్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే వారిని అప్రమత్తం చేసి అన్ఇన్స్టాల్ చేయిస్తే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా బయటపడవచ్చు.







