శనగ పంటకు ( gram cultivation )గాలి ద్వారా వివిధ రకాల తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.ఈ తెగుల వల్ల శనగ మొక్కలు కుళ్లిపోయి ఎండిపోతాయి.
రైతులు పంటలు గమనిస్తూ సరైన సమయంలో సస్యరక్షక పద్ధతులు పాటించాలి.ముఖ్యంగా వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు గాలి ద్వారా బూజు తెగులు శనగ పంటను ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి.
ఈ బూజు తెగులు బొట్రైటీస్ సినేరియా ( Botrytis cinerea )అనే ఒక శిలీంద్రం ద్వారా వ్యాపిస్తాయి.శనగ పంట పూత దశలో ఉన్నప్పుడు ఈ బూజు తెగులు పంటను ఆశించి వ్యాప్తి చెందుతుంది.
కాబట్టి పంట పూత దశలో ఉన్నప్పుడు గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి.లేదంటే ఈ తెగులతో కాండం, ఆకులు, పూతలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి.
ఈ తెగులు సోకిన మొక్కకు కాయలు ఏర్పడవు.తెగులు సోకిన కొమ్మలు పూర్తిగా కుళ్లిపోయి చనిపోతాయి.

ఈ తెగుల నుండి పంటను సంరక్షించుకోవాలి అంటే మొక్కల మధ్య దూరం ఉండాలి.నీటిపారుదల ప్రాంతాలలో కాస్త ఆలస్యంగా విత్తు కోవాలి.ఈ తెగుల ఉనికిని గుర్తించి ఆ మొక్కలను పంట నుండి వేరు చేసి కాల్చి నాశనం చేయాలి.తరువాత మొక్కలు పూర్తిగా తడిచేటట్లు ఒక లీటరు నీటిలో థయో బెండజోల్( Thiobendazole ) 200 గ్రాములు కలిపి పిచికారి చేసి నివారించాలి.

ఇక పంట పొలంలో ఎప్పటికప్పుడు కలుపు ను నివారించాలి.పంటకు నీటి తడులు అందిస్తే ఖచ్చితంగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి.రాత్రి సమయాలలో కాకుండా ఉదయం పూట మాత్రమే నీటి తడులు అందించాలి.ఇలా అన్ని మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే పెట్టుబడి కాస్త తగ్గడంతో పాటు దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంది.







