Avika Gor:సీరియల్ లోని సన్నివేశాలపై స్పందించిన అవికా గోర్.. 7 సార్లు పెళ్లి, 3 సార్లు చచ్చిపోయానంటూ?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ అవికా గోర్( Heroine Avika Gor ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అవికా గోర్ పేరు వినగానే చాలామందికి చిన్నారి పెళ్ళి కూతురు సీరియల్( Chinnari pellu kuthuru serial ) గుర్తుకొస్తూ ఉంటుంది.

 Avika Gor Admits She Did Many Cringe Things In Sasural Simar Ka-TeluguStop.com

చైల్డ్ ఆర్టిస్ట్ గానే భారీగా పాపులారిటీని సంపాదించుకుంది అవికా గోర్.ఇప్పటికీ ఈమె నటించిన సీరియల్స్ టీవీలలో ప్రసారం అవుతూనే ఉన్నాయి.

ఇకపోతే హీరోయిన్ గా రాజ్ తరుణ్ తో కలిసి ఉయ్యాల జంపాల సినిమాలో( Uyyala Jampala movie ) నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ తర్వాత అవికా గోర్ వినగానే ఉయ్యాల జంపాల సినిమా గుర్తుకు వస్తూ ఉంటుంది.

Telugu Horrors Heart, Avika Gor, Chinnaripellu, Raj Tarun, Uyyala Jampala-Movie

ఈ సినిమా తర్వాత సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా సూపర్ హిట్ సినిమాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.నటించినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆమె నటించిన అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.అందం అభినయం నటన అన్ని ఉన్నప్పటికీ ఈమెకు అనుకున్న విధంగా అవకాశాలు రాలేదు.ఇది ఇలా ఉంటే తాజాగా తన తదుపరి బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ 1920 హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు.

ఇందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ముఖ్యంగా ససురాల్‌ సిమర్‌ కా సీరియల్‌ లోని కొన్ని విషయాలు తనకు హాస్యాస్పదంగా అనిపించాయని చెప్పారు.

Telugu Horrors Heart, Avika Gor, Chinnaripellu, Raj Tarun, Uyyala Jampala-Movie

ససురాల్‌ సిమర్‌ కా ధారావాహికలో నేనూ, మరో నటి ప్రధాన పాత్రలు పోషించాము.అయితే ఆ సీరియల్‌ లోని పలు సీన్స్‌ నాకు ఇబ్బందికరంగా, వాస్తవానికి దూరంగా అనిపించాయి.ఇందులో నేను మూడుసార్లు చచ్చిపోయి తిరిగి వచ్చినట్టు చూపించారు.అలాగే, నేను దెయ్యాలతో మాట్లాడుతున్నట్లు చూపించారు.మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే.అందులో నాకు ఏడుసార్లు పెళ్లి చేశారు.

మూడుసార్లు హీరోతో మరో నాలుగు సార్లు వేరే వ్యక్తులతో వివాహం చేసినట్లు చూపించారు.ఆ సీన్స్‌ని తలచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది అని ఆమె తెలిపారు.

ఇక, తనకు బద్ధకం ఎక్కువని, ఒకానొక సమయంలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టలేదని చెప్పారు.లాడో 2 చేస్తున్నప్పుడు విపరీతంగా బరువు పెరిగిపోయానని, ఆ సమయంలో అందరూ తనని కామెంట్స్‌ చేశారని చెప్పారు.

ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి సన్నగా మారానని అన్నారు అవికా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube