పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టి వరుస సినిమాలను పూర్తి చేస్తూ పోతున్న విషయం తెలిసిందే.ఇప్పటి వరకు రాజకీయాలకు స్వల్పంగా బ్రేక్ ఇచ్చి సినిమాలు చేస్తూ ఉన్న పవన్ మరికొద్ది రోజుల్లో మళ్ళీ రాజకీయాల్లో బిజీగా మారబోతున్నాడు.
ఈ లోపులోనే ఈయన లైనప్ లో ఉన్న ‘ఓజి’ సినిమాను( OG Movie ) వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.
టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్( Director Sujeeth ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే పెరిగి పోయాయి.
ఈ సినిమాను ప్రకటించినప్పటి నుండి వరుస అప్డేట్ లను అందిస్తూ మరింత హోప్స్ పెంచేస్తూ ఉన్నారు.రీసెంట్ గానే మూడవ షెడ్యూల్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాలో యంగ్ అండ్ ఫేమస్ నటుడు అర్జున్ దాస్ ఉన్నట్టు నిన్న అఫిషియల్ గా అనౌన్స్ చేసి ఎగ్జైట్మెంట్ పెంచేశారు.

మరి తాజాగా ఈ సినిమా కథ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ కబురు తెలుస్తుంది.ఇప్పటి వరకు ఈ సినిమా నుండి బయటకు వచ్చిన పవర్ స్టార్ లుక్ చూసి పవన్ ను వింటేజ్ లుక్ లో చూపిస్తున్నాడు అని అనుకున్నారు.మరి తాజాగా ఈ కథ బ్యాక్ డ్రాప్ గురించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తుంది.సుజీత్ ఈ సినిమా కథను 1950ల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

గ్యాంగ్ స్టర్ డ్రామా అప్పట్లో ఎలా ఉండనుందో చూపించబోతున్నట్టు టాక్.మొత్తానికి ఈ కథ అయితే ఉహించనిదే అని చెప్పాలి.సుజీత్ ఈ సినిమాలో పవన్ ను ఏ రేంజ్ లో చూపిస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.







