బర్త్ డే బ్లాస్ట్.. బాలయ్య - బాబీ కొత్త మూవీ లాంఛ్.. ఈసారి ట్రీట్ మాములుగా లేదుగా!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ఈ రోజు బర్త్ డే జరుపుకొంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇస్తున్నాడు.

 Nbk109 Nandamuri Balakrishna Teams Up With Director Bobby Details, Director Bobb-TeluguStop.com

ఎప్పటి కంటే ఈసారి ట్రీట్ మరింత అదిరిపోయేలా ఇచ్చి నందమూరి ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తుతున్నాడు.ఇప్పటికే ఈయన నటిస్తున్న 108వ సినిమా భగవంత్ కేసరి( Bhagwant Kesari movie ) నుండి టీజర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది.ఇక ఇక్కడితో ట్రీట్ అయిపోలేదు.అని కాస్త లేటుగా తెలిసింది.ఎందుకంటే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ కావడంతో ఇదే బర్త్ డే ట్రీట్ అని అంతా అనుకున్నారు.కానీ ఇప్పుడు బాలయ్య మరో కొత్త సినిమాను అనౌన్స్ చేయడమే కాకుండా ఈ రోజే లాంచ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు.

బాలయ్య తన 109వ సినిమాను ఈ రోజు లాంచ్ చేసారు.

యంగ్ డైరెక్టర్ బాబీ( Director Bobby ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.ఎప్పటి నుండో వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అని వార్తలు రాగా ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తుండగా నిర్మాతగా నాగ వంశీ వ్యవహరించ బోతున్నారు.

ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసారు.ఈ సినిమాకు కూడా థమన్ సంగీతం అందించనున్నాడు.మరి త్వరలోనే అనిల్ రావిపూడి సినిమా షూట్ పూర్తి కాగానే ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

మరో నెలలోనే భగవంత్ కేసరి పూర్తి అయ్యే అవకాశం ఉండగా వెంటనే స్టార్ట్ చేస్తారో లేదంటే దసరాకు ఈ సినిమా రిలీజ్ అయ్యాక అప్పుడు కొత్త సినిమాను స్టార్ట్ చేస్తాడో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube