బర్త్ డే బ్లాస్ట్.. బాలయ్య – బాబీ కొత్త మూవీ లాంఛ్.. ఈసారి ట్రీట్ మాములుగా లేదుగా!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Nandamuri Balakrishna ) ఈ రోజు బర్త్ డే జరుపుకొంటున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇస్తున్నాడు.ఎప్పటి కంటే ఈసారి ట్రీట్ మరింత అదిరిపోయేలా ఇచ్చి నందమూరి ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తుతున్నాడు.

ఇప్పటికే ఈయన నటిస్తున్న 108వ సినిమా భగవంత్ కేసరి( Bhagwant Kesari Movie ) నుండి టీజర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు.

"""/" / అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది.

ఇక ఇక్కడితో ట్రీట్ అయిపోలేదు.అని కాస్త లేటుగా తెలిసింది.

ఎందుకంటే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ కావడంతో ఇదే బర్త్ డే ట్రీట్ అని అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడు బాలయ్య మరో కొత్త సినిమాను అనౌన్స్ చేయడమే కాకుండా ఈ రోజే లాంచ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు.

బాలయ్య తన 109వ సినిమాను ఈ రోజు లాంచ్ చేసారు.యంగ్ డైరెక్టర్ బాబీ( Director Bobby ) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఎప్పటి నుండో వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అని వార్తలు రాగా ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తుండగా నిర్మాతగా నాగ వంశీ వ్యవహరించ బోతున్నారు.

"""/" / ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసారు.

ఈ సినిమాకు కూడా థమన్ సంగీతం అందించనున్నాడు.మరి త్వరలోనే అనిల్ రావిపూడి సినిమా షూట్ పూర్తి కాగానే ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

మరో నెలలోనే భగవంత్ కేసరి పూర్తి అయ్యే అవకాశం ఉండగా వెంటనే స్టార్ట్ చేస్తారో లేదంటే దసరాకు ఈ సినిమా రిలీజ్ అయ్యాక అప్పుడు కొత్త సినిమాను స్టార్ట్ చేస్తాడో వేచి చూడాలి.

వీడియో వైరల్: ఈ కుక్క యాక్టింగ్ ముందర ఆస్కార్ కూడా వేస్టేనేమో..