ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్ కార్ట్ ( Flipkart )లో జూన్ 10 నుంచి జూన్ 14 వరకు కొన్ని ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ లపై భారీ డిస్కౌంట్ ఉండనుంది.మార్కెట్లో ప్రముఖ బ్రాండ్లుగా చలామణి అవుతున్న ఆపిల్, శాంసంగ్, పోకో( Apple, Samsung, Poco ) లాంటి కంపెనీ లకు చెందిన స్మార్ట్ ఫోన్లు భారీ తగ్గింపుతో కొనుగోలుదారులకు చేరువ అవ్వనున్నాయి.
ఎక్స్చేంజ్ ఆఫర్లో నచ్చిన స్మార్ట్ ఫోన్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.అంతేకాదు HDFC, కొటక్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
Poco X5 5G ఫోన్: భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.18999 ఉన్న సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో భారీ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది.ఈ క్రమంలో రూ.15999 లకే అందుబాటులోకి వచ్చింది.అంతేకాదు ఈ ఫోన్ ను HDFC లేదా కోటక్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ ₹1000 డిస్కౌంట్ పొంది కేవలం రూ.14999 లకే కొనుగోలు చేయవచ్చు.
Moto G62 ఫోన్: ఈ ఫోన్ అసలు ధర రూ.15499.కానీ ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డెస్క్ ఆఫర్లో భాగంగా రూ.14499 లకే కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ F23 5G ఫోన్: ఈ ఫోన్ మార్చి 2023లో విడుదల అయింది.ఫ్లిప్కార్ట్ సేవింగ్ డెస్క్ లో భాగంగా కొనుగోలు చేస్తే రూ.13499 కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.ఇంకా శాంసంగ్ గెలాక్సీ F13 ను రూ.10999 కు కొనుగోలు చేయవచ్చు.శాంసంగ్ గెలాక్సీ M14 ను రూ.14327 పొందవచ్చు.
ఆపిల్ ఆన్లైన్ స్టోర్ లో 128GB ఉండే వేరియంట్ ఐఫోన్ 13 ధర రూ.69900 గా ఉంది.ఫ్లిప్కార్ట్ బిగ్ సైన్లో భాగంగా రూ.58749 కే పొందవచ్చు.ఎస్బిఐ క్రెడిట్ కార్డు ఉంటే ఇంకా 750 రూపాయలు తగ్గింపు లభించనుంది.