తన పనితో నెటిజన్లను ఫిదా చేసిన పిల్లవాడు.. అతడి చేసిన పనికి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

చిన్నారులకు మంచి మనస్సు ఉంటుంది.చిన్నతనంలో వారికి ఏమీ తెలియదు కానుక మనస్సు స్వచ్చంగా ఉంటుంది.

 Humanity Of A Small Kid Pouring Water For Birds Video Viral Details, Humanity ,-TeluguStop.com

దీంతో చిన్నారులు చేసే పనులు అందరికీ నవ్వు తెప్పిస్తాయి.పిల్లలు చేసే పనులు చాలా సరదాగా ఉంటాయి.

చిన్నారులు చేసే ఫన్నీ ఇన్సిడెంట్స్‌కు( Funny Incidents ) సంబంధించిన వీడియోలను చూసేందుకు కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు.తాజాగా ఒక బాలుడికి సంబంధించిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో బాలుడు చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు.

భగభగమండే ఎండలో పక్షులకు ఒక బాలుడు నీరు పట్టి పోయడం అందరినీ ఆకర్షిస్తోంది.ఎండలో పక్షుల కోసం( Birds ) బాలుడి చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు.బాలుడి మంచి మనస్సుకు అందరూ తెగ పొగిడేస్తున్నారు.

ఇంత చిన్న వయస్సులోనే నెటిజన్ల మనస్సులను దొచుకున్నాడు బాలుడు.ఎవరూ చెప్పకుండానే ఎండలో పక్షుల బాధలు అర్థం చేసుకుని బాలుడు నీళ్లు పట్టించడం అందరినీ కదిలిస్తోంది.

చిన్న వయస్సులోనే పెద్దగా ఆలోచిస్తున్నాడని నెటిజన్లు కితాబిస్తున్నారు.

ప్రియాంక బిస్వాస్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ షేర్ చేశాడు.వీడియోలో ఒక చిన్న పిల్లవాడు ట్యాంక్ నుంచి నీటి సీసాను నింపి( Water Bottle ) పక్షుల కోసం జాగ్రత్తగా కంటైనర్‌లో పోశాడు.ఈ వీడియోను షేర్ చేసిన ప్రియాంక బిస్వాస్.

ఈ కలియుగంలో బాలుడు భగవంతుడి రూపంలో పక్షుల కోసం వచ్చాడేమో అంటూ కామెంట్ చేశాడు.ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఎంతో దయ గల చిన్నారి అని ఒకరు కామెంట్ చేయగా.అందమైన దేవదూత అని మరికొందరు కామెంట్ చేశారు.

చిన్నపిల్లలు చేసే పనులు పెద్దవారిని ఆలోచించచేస్తాయని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.పక్షుల పట్ల చిన్నారి కరుణ చూపడం గొప్ప విషయమని మరోక నెటిజన్ కామెంట్ చేశాడు.

మొత్తానికి ఈ బాలుడి ఆలోచన అందరినీ ఆకట్టుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube