పాకిస్థాన్ దేశంలో( Pakistan ) ద్రవ్యోల్బణం రాకెట్‌లా దూసుకుపోతున్న వేళ అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.ప్రస్తుతం పాక్‌లో ఇన్ఫ్లేషన్ 38 శాతానికి చేరుకుంది.అంటే నిన్న రూ.100 పలికిన ఒక వస్తువు ఇవాళ రూ.138 రూపాయలు అయ్యిందని అర్థం.ద్రవ్యోల్బణం అనేది పెరిగిన వస్తువుల ధరలకు సూచనగా నిలుస్తుంది.ప్రస్తుతం ఇండియాలో 5.1 శాతంగా ద్రవ్యోల్బణం రేటు ఉంది.అంటే పాకిస్థాన్ దేశంలో ఎంత ఎక్కువగా వస్తువుల ధరలు పెరిగాయో అర్థం చేసుకోవచ్చు.ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం( Pakistan Govt ) డబ్బులు సేకరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
తగ్గిపోతున్న విదేశీ మారక నిల్వలు పెంచుకునేందుకు కూడా చేయాల్సిన పనులు అన్నీ చేస్తోంది.
ఇందులో భాగంగా పాక్ గవర్నమెంట్ న్యూయార్క్‌లోని( New York ) తనకు చెందిన రూజ్‌వెల్ట్ హోటల్‌ను( Roosevelt Hotel ) మూడు సంవత్సరాల పాటు రెంట్‌కు ఇచ్చింది.
వందేళ్ల చరిత్ర గల ఈ హోటల్‌ను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ గతంలో కొనుగోలు చేసింది.అయితే కరోనాకాలంలో నష్టాలు వచ్చి దీనిని మూసి వేసింది.
ఇక 2023లో రీఓపెన్ అయిన ఈ హోటల్ మొన్నటిదాకా శరణార్థులకు ఆశ్రయంగా ఉంది.అయితే ఇంకా దీనివల్ల నష్టాలే కలుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితులలో ఆర్థిక పతనం అంచున ఉన్న పాక్ గవర్నమెంట్ దీనిని అమ్మేసే అవకాశం ఉందని ఇటీవల కాలంలో వార్తలు వచ్చాయి.
కాగా అది నిజం కాలేదు.కానీ ప్రభుత్వం ఈ హోటల్‌ను న్యూయార్క్ అడ్మినిస్ట్రేషన్‌కు అద్దెకు ఇచ్చింది.మూడేళ్లపాటు రెంట్‌కి ఇవ్వడం ద్వారా పాకిస్థాన్ 220 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2 వేల కోట్లు) సొమ్ము పొందనుంది.పాకిస్థాన్‌కు విదేశాలలో రూజ్‌వెల్ట్ హోటల్‌తో పాటు ఇంకొక హోటల్ ఉంది.
రూజ్‌వెల్ట్ హోటల్ న్యూయార్క్‌లో ఉండగా మరొకటి ప్యారిస్‌లో నగరంలోని రిచ్ ఏరియాలో ఉంది.ఈ రెండు హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్‌కి ఏ మాత్రం తీసిపోని హైటెక్ ఫెసిలిటీస్ ఆఫర్ చేస్తున్నాయి.
రూజ్‌వెల్ట్ హోటల్ న్యూయార్క్‌లోని మాన్‌హాటన్‌లో ఉంటుంది.యూఎస్ ప్రెసిడెంట్ థియోడర్ రూజ్‌వెల్ట్ గౌరవార్థం ఈ హోటల్‌కు ఆ నామకరణం చేశారు.న్యూయార్క్ సెంట్రల్ రైల్‌రోడ్, న్యూ హెవెన్ హార్ట్‌ఫోర్డ్ రైల్‌రోడ్ సంస్థలు కలిసి ఈ అత్యంత అందమైన హోటల్‌ను నిర్మించాలి.19 అంతస్తులు ఉన్న ఈ హోటల్ 1924లో ఓపెన్ అయింది.అంటే దాదాపు ఈ హోటల్‌కి 100 ఘన చరిత్ర ఉందని చెప్పవచ్చు.అప్పట్లో ఈ హోటల్‌ను అమెరికా చారిత్రక కట్టడాలు అనుసరించి నిర్మించారు.రూజ్‌వెల్ట్ హోటల్ 43,313 చదరపు అడుగుల విస్తీర్ణంలో చాలా పెద్దగా ఉంటుంది.దీని ఎత్తు 76 మీటర్లు.
గదులు సంఖ్య 1,057.మీటింగ్ హాల్ విస్తీర్ణం 30 వేల అడుగులు.
ఇందులో 2 బాల్‌రూమ్స్, 17 మీటింగ్ రూమ్స్ ఉన్నాయి.






