దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ కియా కు భారత మార్కెట్లో ఎంతో మంచి గుర్తింపు ఉంది.ఈ కంపెనీకి చెందిన కియా పికాంటో నిన్నటి వరకు కేవలం విదేశీ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉండేది.
ప్రస్తుతం భారత మార్కెట్లోకి ఈ కియా పికాంటో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇక ఈ కియా పికాంటో( Kia Picanto ) అప్ డేటెడ్ వెర్షన్ కు సంబంధించిన ధర, అద్భుతమైన ఫీచర్స్ ఏంటో చూద్దాం.

ఈ కియా పికాంటో కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ను పొందుతుంది.ఇంకా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఎంపికను కూడా పొందుతుంది.ఇక 83 బీ హెచ్ పీ పవర్, 122 ఎన్ ఎమ్ గరిష్ట టార్క్ ఇస్తుంది.ఈ కారు 100 బిహెచ్పి శక్తిని, 172 Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ కారుకు వెనుక భాగంలో ఎల్ఈడి టెయిల్ లైట్లు అమర్చబడి ఉంటాయి.ఈ కారుకు రెండువైపులా ఎల్ఈడి లైట్ బార్లు ఉంటాయి.ఈ కారు 433 లీటర్ల పెద్ద బూట్ స్పేస్( Boot space ) తో అందుబాటులోకి వచ్చింది.

అంతేకాకుండా ఈ కియా పికాంటో కారులో డ్యాష్ బోర్డ్ ఫ్రీ – స్టాండింగ్ 8 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఇన్స్ట్రుమెంటేషన్ కోసం 4.2 స్క్రీన్ అమర్చారు.ఈ కారులో ప్రత్యేకంగా స్టీరింగ్ విల్, ఇతర ఇంటీరియర్ బిట్స్ ఔట్ గోయింగ్ మోడల్ గా ఉంటాయి.
ప్రస్తుతం రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని, భద్రత కోసం ఎయిర్ బ్యాగులు( Air bags ), ABS,ADAS లాంటి లక్షణాలను ఇందులో పొందుపరిచారు.ఇక ఈ కారు ఎక్స్ షోరూమ్ లో ప్రారంభ ధర రూ.7 లక్షలు ఉండవచ్చని అంచనా.కంపెనీ మాత్రం ధర గురించి పెద్దగా వెల్లడించలేదు.
త్వరలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.







