స్మార్ట్ ఫోన్( Smart phone ) వాడుతున్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం వాట్సాప్ వినియోగదారుల అవసరాలు, భద్రతను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది.
ఇక తాజాగా వాట్సాప్ లో ఇమేజ్ క్రాప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది.ప్రస్తుతం వాట్సాప్ ఈ ఫీచర్ కు సంబంధించిన టూల్ ను అభివృద్ధి చేసే పనిలో ఉంది.
సాధారణంగా ఇమేజ్ ను ఫోన్లో లేదా ల్యాప్ టాప్ లో లేదా డెస్క్ టాప్ లో మనకు కావాల్సిన విధంగా క్రాప్ చేసి, సేవ్ చేశాక వాట్సాప్ లో షేర్ చేస్తాము.ప్రస్తుతం అందుబాటులోకి రానున్న ఇమేజ్ క్రాప్ ఫీచర్ లో ఆ సమస్యకు చెక్ పెట్టేసినట్లే.
వాట్సాప్ తీసుకువచ్చిన ఈ సరికొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందో వాబీటా ఇన్ఫో ( WABetaInfo ) చక్కగా వివరించింది.ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి ఏ ఇమేజ్ ను క్రాప్ చేయాలో ఎంచుకోవాలి.ఆ తర్వాత ఇమేజ్ పై భాగంలో ఒక యారో మార్క్ చూపిస్తున్న క్రాప్ అని ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత మనకు కావలసిన సైజులో ఆ ఇమేజ్ ను క్రాప్ చేసుకోవాలి.
తర్వాత ఆ ఫోటోలు వాట్సప్ ద్వారా షేర్ చేయవచ్చు.
ఈ విధంగా ఇమేజ్ ను క్రాప్ చేయడం వల్ల చాలా సమయం ఆదా అవుతుంది.అంతేకాదు ఇమేజ్ ను క్రాప్ చేసేందుకు వివిధ రకాల టూల్స్ వాడాల్సిన అవసరం ఉండదు.అయితే ఈ ఫీచర్ కు సంబంధించిన టూల్స్ అభివృద్ధి చేసిన తర్వాత స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో (WABetaInfo) తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ మెసేజింగ్ యాప్ వాడే వారి సంఖ్య అధికంగా ఉండడంతో, ఎప్పటికప్పుడు వాట్సప్ సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.