యాదాద్రి భువనగిరి జిల్లా
: మానవత్వం మంట కలిసిమనీ తత్వం పెరిగిపోతున్న నేటి సమాజంలో బంధాలు,అనుబంధాలు అడ్రస్ లేకుండా పోతూ చివరికి రక్త సంబంధాలు కూడా రక్తసిక్తం అవుతున్నాయి.సభ్యసమాజం సిగ్గుపడే ఇలాంటి దారుణ ఘటన అడ్డగూడూరు మండలం( Addagudur Mandal ) మానాయికుంట గ్రామంలో( Manaikunta village ) బుధవారం జరిగింది.
గ్రామానికి మార్క సైదులు, వీరయ్య( Marka Saidulu, Veeraiah ) అనే అన్నదమ్ముల మధ్య గత కొన్నాళ్లుగా భూతగాదాలు సాగుతున్నాయి.ఈ నేపథ్యంలో అన్నదమ్ములు రక్తసంబంధం మరచి పరస్పరం గొడ్డళ్ళతో దాడులు చేసుకొని పైశాచికంగా నరుక్కున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.బుధవారం వీరయ్య వ్యవసాయ భూమిలో అచ్చులు తోలుతుండగాసైదులు,అతని కొడుకు శేఖర్ లు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా తలెత్తిన ఘర్షణలో వీరయ్య అతని కుమారుడు ప్రభాస్ లు, సైదులు అతని కుమారుడు శేఖర్ లు పరస్పరం గొడ్డళ్లతో దాడులు చేసుకున్నారు.ముందస్తుగానే ఘర్షణకు సిద్ధమై వారు గొడ్డళ్లతో దాడి చేసుకోగా దాడుల్లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కాళ్లు చేతులు అక్కడికక్కడే తెగిపోగా,తలపై, వెన్నుపూసల్లో గాట్లు పడ్డాయి.ఇరుగుపొరుగు రైతులు,స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా,ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మోత్కూర్ ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం, భువనగిరి ఆసుపత్రికి, అటు నుంచి హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.
వారంతా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.అడ్డగుడురు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







