బోయపాటి – రామ్ ‘RAPO20’ లాస్ట్ షెడ్యూల్.. ఎక్కడంటే?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని( Ram Pothineni ) ఇష్మార్ట్ శంకర్, ది వారియర్ వంటి యాక్షన్ సినిమాలతో అలరించిన రామ్ ఇప్పుడు అసలు సిసలైన యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్( Boyapati Srinu ) దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.ఇష్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కు మాస్ లో ఫాలోయింగ్ పెరిగింది.

 Ram Pothineni Boyapatis Rapo20 Shoot Update-TeluguStop.com

అందుకే ఈ ఇద్దరి కాంబోపై భారీ అంచనాలు పెరిగాయి.రామ్ కథానాయకుడిగా శ్రీలీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”RAPO20”.

పాన్ ఇండియా రేంజ్ లో బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో కాస్త భారీగానే ప్లాన్ చేసారు.ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ గురించి ఇంట్రెస్టింగ్ వచ్చింది.ఈ సినిమా రేపటి నుండి ఆఖరి షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నారు అని ఆ షెడ్యూల్ జూన్ 15 వరకు ఉంటుంది అని తెలుస్తుంది.ఈ షెడ్యూల్ మైసూర్( Schedule in Mysore ) లో ప్లాన్ చేశారట.ఒక పాట, ఒక ఫైట్ ను ఈ షెడ్యూల్ లో పూర్తి చేసి ఆ తర్వాత హైదరాబాద్ లో మరో పాట చిత్రీకరిస్తే ఈ సినిమా షూట్ కు గుమ్మడికాయ కొట్టేయవచ్చు అని తెలుస్తుంది.

ఈ టోటల్ వర్క్ మొత్తం జూన్ నెలలో పూర్తి చేయనున్నారట.ఆ తర్వాత జులై నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఇక వరుస ప్రమోషన్స్ ను చేయనున్నారు.మరి ఈ సినిమాను ఫైనల్ గా ఎప్పుడు రిలీజ్ చేస్తారో త్వరలోనే క్లారిటీ కూడా రానుంది.ఇదిలా ఉండగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.50 కోట్లకు పైగానే బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించినట్టు టాక్.చూడాలి ఈ కాంబో ఎలాంటి హిట్ అందుకుంటుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube