బోయపాటి – రామ్ ‘RAPO20’ లాస్ట్ షెడ్యూల్.. ఎక్కడంటే?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని( Ram Pothineni ) ఇష్మార్ట్ శంకర్, ది వారియర్ వంటి యాక్షన్ సినిమాలతో అలరించిన రామ్ ఇప్పుడు అసలు సిసలైన యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్( Boyapati Srinu ) దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.

ఇష్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కు మాస్ లో ఫాలోయింగ్ పెరిగింది.అందుకే ఈ ఇద్దరి కాంబోపై భారీ అంచనాలు పెరిగాయి.

రామ్ కథానాయకుడిగా శ్రీలీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''RAPO20''.

పాన్ ఇండియా రేంజ్ లో బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో కాస్త భారీగానే ప్లాన్ చేసారు.

ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.

"""/" / ఇక ఇప్పుడు ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ గురించి ఇంట్రెస్టింగ్ వచ్చింది.

ఈ సినిమా రేపటి నుండి ఆఖరి షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నారు అని ఆ షెడ్యూల్ జూన్ 15 వరకు ఉంటుంది అని తెలుస్తుంది.

ఈ షెడ్యూల్ మైసూర్( Schedule In Mysore ) లో ప్లాన్ చేశారట.

ఒక పాట, ఒక ఫైట్ ను ఈ షెడ్యూల్ లో పూర్తి చేసి ఆ తర్వాత హైదరాబాద్ లో మరో పాట చిత్రీకరిస్తే ఈ సినిమా షూట్ కు గుమ్మడికాయ కొట్టేయవచ్చు అని తెలుస్తుంది.

"""/" / ఈ టోటల్ వర్క్ మొత్తం జూన్ నెలలో పూర్తి చేయనున్నారట.

ఆ తర్వాత జులై నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ఇక వరుస ప్రమోషన్స్ ను చేయనున్నారు.

మరి ఈ సినిమాను ఫైనల్ గా ఎప్పుడు రిలీజ్ చేస్తారో త్వరలోనే క్లారిటీ కూడా రానుంది.

ఇదిలా ఉండగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

50 కోట్లకు పైగానే బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించినట్టు టాక్.చూడాలి ఈ కాంబో ఎలాంటి హిట్ అందుకుంటుందో.

Mummys Gold Review: How Mummys Gold Works And What Canadian Players Should Know