ఈ మండుతున్న ఎండాకాలంలో కూలింగ్ వాటర్( Cooling water ) తాగేందుకు చాలామంది ఇష్టపడుతూ వుంటారు.ఐతే… అదే పనిగా చల్లని నీరు తాగాలంటే ఇబ్బందిగా ఉంటుంది.ఈ క్రమంలోనే మనకి అందుబాటులో రకరకాల వాటర్ రెసిపీలు మార్కెట్లోకి వచ్చాయి.అయితే, వాటిని అక్కడ కొని తాగడం కంటే మన సొంతంగా తయారు చేసి తాగితే ఆరోగ్యం.అలాంటి నోరూరించే కొన్ని ఫ్లేవర్లను పండ్లతో ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దామా.
1.ముందుగా ఇక్కడ ‘వాటర్ లైమ్ ట్విస్ట్’ ( Water Lime Twist )రెసిపీ గురించి చూద్దాము.దీనికోసం కప్పుల పుచ్చకాయ ముక్కలు, ఒక నిమ్మకాయ ముక్కలు, కొన్ని తులసి ఆకులు తీసుకొని అన్నింటినీ ఓ కప్పులో వేసి, నీరు పోసి బాగా కలుపుకొని ఫ్రిజ్‌లో 2 గంటలు ఉంచి తాగితే.
సూపర్ టేస్టీ ఉంటుంది.

2.రెండవ రెసిపీని చూస్తే, ఒక యాపిల్‌ని సన్నని ముక్కలుగా చేసుకొని ఓ గిన్నెలో నీరు పోసి, అందులో 2 దాల్చినచెక్క( cinnamon ) స్టిక్స్ వేసుకొని, తరువాత యాపిల్ ముక్కలు వెయ్యండి.వాటిని బాగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచి.
రాత్రి పూట తాగితే ఒంటికి చాలా బాగుంటుంది.

3.మూడవ రెసిపీని చూస్తే, ఒక నిమ్మకాయను సన్నని స్లైసెస్‌లా కట్ చేసుకోండి.దానికోసం 1 టేబుల్ స్పూన్ అల్లాన్ని తురిమి, ఓ గిన్నెలో నీరు పోసి, వీటిని కలిపి ఫ్రిజ్‌లో గంట సేపు ఉంచి తాగితే అదో రకమైన టేస్ట్ గురూ.
4.ఇక నాల్గవ రెసిపీలో… ఒక కీరదోసకాయను ( Cucumber )సన్నగా కట్ చేసి, పుదీనా ఆకులు కొన్ని తీసుకొని, రెండింటినీ నీటిలో మిళితం చేయండి.
ఆ మిశ్రామన్ని కొన్ని గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచుకొని తర్వాత తాగితే.మంచి రిలీఫ్ ఉంటుంది.

5.ఐదవ రెసిపీని చూస్తే, ఒక కప్పు పైనాపిల్ ముక్కలు( Slices of pineapple ), అరకప్పు లేత కొబ్బరి తీసుకొని వీటిని నీటిలో కలిపి.కొన్ని గంటలు ఫ్రిజ్‌లో ఉంచి తాగితే అద్భుతంగా ఉంటుంది.
6.6వ రెసిపీని చూస్తే, అరకప్పు స్ట్రాబెర్రీ ముక్కలు, అరకప్పు రాస్ బెర్రీస్, అరకప్పు బ్లూబెర్రీస్, కొన్ని తులసి పువ్వులను.నీటిలో కలిపి, ఫ్రిజ్‌లో కొన్ని గంటలు కూల్ చేసి, రాత్రి పూట తాగితే.
బాడీ సూపర్ కూల్ అవుతుంది.







