తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెంచింది.ఇందులో భాగంగా బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి రానున్నారు.
ఈ నేపథ్యంలోనే మూడు భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది.మోదీ తొమ్మిదేళ్ల పాలనలో భాగంగా ప్రజల్లోకి వెళ్తుంది.
అయితే అసలు టార్గెట్ మాత్రం తెలంగాణలో పార్టీ బలోపేతం కోసమేనని తెలుస్తోంది.ఈనెల 15న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖమ్మంకు రానుండగా.
అదే రోజు సాయంత్రం నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు.అదేవిధంగా ఈనెల 25న నాగర్ కర్నూల్ జిల్లాకు రానున్న జేపీ నడ్డా బహిరంగ సభలో పాల్గొననున్నారు.







