నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) అఖండ మరియు వీర సింహారెడ్డి ( Veera Simha Reddy )సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ రెండు సినిమాలు అంచనాలను అందుకుని సక్సెస్ ని సొంతం చేసుకున్నాయి.
ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కి కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.రూ.100 కోట్ల సినిమా అంటూ అభిమానులు చాలా నమ్మకంగా మాట్లాడుకుంటున్నారు.ఈ నేపద్యంలో అనిల్ రావిపూడి మరింత శ్రద్ధ పెట్టి మరి సినిమా ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ నెలలో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు కచ్చితంగా టైటిల్ తో కూడిన ఇంట్రెస్టింగ్ పోస్టర్ లేదా వీడియో ని రివీల్ చేసేందుకు రెడీ అవుతున్నారు.బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తాము ఇవ్వబోతున్న సర్ప్రైజ్ కి సిద్ధంగా ఉండాలి అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా అలర్ట్ అయ్యేట్లు చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటన చేయడం జరిగింది.అనిల్ రావిపూడి గత కొన్ని నెలలుగా ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడడం లేదు.
పైగా సినిమా లో బాలయ్య ను ఐదు పదుల వయసు దాటిన వ్యక్తిగా చూపించబోతున్నారు.కనుక ఎలా ఉంటాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా రాబోతున్న టీజర్ లేదా పోస్టర్ లో శ్రీలీల( Srileela ) కూడా ఉండబోతుందట.ఆమె సినిమా లో బాలకృష్ణ కు కూతురు పాత్రలో కనిపించబోతుంది.
కూతురి తో కలిసి పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆ పోస్టర్ లేదా వీడియో సినిమా పై అంచనాలు పెంచడం లో సక్సెస్ అవుతుందా అనేది చూడాలి.