రాజన్న సిరిసిల్ల జిల్లా : మస్కట్ బల్దియా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగినది.ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ నాయకులు మైపాల్ రెడ్డి,కృష్ణ, నర్సయ్య,ఆలీ,కబీర్,డాక్టర్ బి.
ఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ వ్యవస్థాపకులు గాలిగాని రాజు ఉపాధ్యక్షులు మేడిపట్ల లక్ష్మణ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని,సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
తెలంగాణ రాకముందు నీటి కొరత,కరెంటు కొరత ఉండేదన్నారు.
ఇప్పుడు మన కెసిఆర్ సారధ్యంలో ప్రతి గ్రామానికి తాగునీటి,సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులు చేస్తుందన్నారు.అలాగే లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని అలాగే మా గల్ఫ్ కార్మికులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.గాలిగాని రాజు మాట్లాడుతూ ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని

హైదరాబాద్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందని కొనియాడారు.గల్ఫ్ కార్మికులకు ఎన్నారై పాలసీ ఇవ్వాలని గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో నరేష్,గంగాధర్ భూమేష్,అశోక్,వేణు అంబేద్కర్ అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాలు అంజలి రెడ్డి,వరలక్ష్మి,దేవి సుభాష్,లక్ష్మణ్,అత్తర్ భూమేందర్,సాయిగౌడ్,శంకర్, రాజేందర్,వేణు,మహేష్,మధు కనకరాజు,శీను,సురేష్,రంజిత్ గంగాధర్,ప్రవీణ్,చిలుక బ్రదర్స్, సత్యనారాయణ,రమేష్ నాగరాజు,శంకర్,భూమేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.







