ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ‘ఆదిపురుష్’( Adipurush movie ).బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ వండర్ కోసం ఆడియెన్స్ బాగా ఎదురు చూస్తున్నారు.
ఇంతకు ముందు నెగిటివ్ టాక్ వచ్చిన ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.
ప్రభాస్ రాముడిగా( Prabhas ).కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్న విషయం విదితమే.అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.ఈ నెల 16న గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్ లను ఇస్తూ మరింత క్రేజ్ పెంచుతున్నారు.ఇదిలా ఉండగా ఇప్పటికే ఆంధ్రాలో తిరుపతి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈవెంట్ తిరుపతి ( Tirupathi )అని చెప్పారు కానీ అసలు వెన్యూ అండ్ సమయం మాత్రం ఇప్పటి వరకు ఫ్యాన్స్ కు చెప్పకపోవడంతో ఈ ఈవెంట్ ఎక్కడో తెలియక ప్రభాస్ ఫ్యాన్స్( Prabhas Fans ) అప్డేట్ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ ఈవెంట్ ప్లేస్ అండ్ టైం గురించి అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చారు.జూన్ 6న తిరుపతిలో జరగనున్న ఈ ఈవెంట్ ఎక్కడో క్లారిటీ ఇచ్చారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సీటీ స్టేడియంలో జరగనుందని జూన్ 6న సాయంత్రం 5 గంటల నుండి ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
దీంతో ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.మరి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ ఈవెంట్ ను ఎలా పూర్తి చేస్తారో వేచి చూడాలి.







