కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.ముష్టపల్లె గ్రామ శివారులోని పంట పొలాల దగ్గర గేదెపై పులి దాడి చేసి చంపేసింది.
దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అయితే గత రెండు నెలలుగా పులి పంట పొలాల్లో సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారని తెలుస్తోంది.
పులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.







