'పుష్ప 2' అక్కడ రికార్డ్ క్రియేట్ చేయబోతుందా.. బిజినెస్ వివరాలు ఇవే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ”పుష్ప ది రూల్”( Pushpa The Rule ).ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

 Huge Demand For Pushpa 2 Now Details, Pushpa The Rule, Pushpa 2, Allu Arjun, Suk-TeluguStop.com

పుష్ప రాజ్ రాకకోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇటీవలే ఎన్నో అంచనాల మధ్య షూట్ స్టార్ట్ చేసుకున్న ఈ సీక్వెల్ అల్లు అర్జున్ బర్త్ డే( Allu Arjun Birthday ) కానుకగా గ్లింప్స్, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.ఈ అప్డేట్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా అంచనాలు డబల్ అయ్యాయి.”పుష్ప ది రైజ్” సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

పుష్ప పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 పై భారీ హోప్స్ ఏర్పడ్డాయి.బాహుబలి 2, కేజీఎఫ్ 2 సినిమాల తర్వాత ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ సినిమా ఇదే కావడం విశేషం.మొదటి పార్ట్ 350 కోట్లకు పైగా వసూళ్లు అందుకున్న ఈ సినిమా నెక్స్ట్ 1000 కోట్లు అందుకుంటుంది అని ముందు నుండే బజ్ నెలకొంది.అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా శాండిల్ వుడ్ బిజినెస్ పై లేటెస్ట్ బజ్ తెలుస్తుంది.అయితే మేకర్స్ కన్నడలో 30 కోట్ల మేర డిమాండ్ చేస్తుండగా కన్నడ బయ్యర్స్ మాత్రం 25 కోట్ల వరకు మొగ్గు చూపిస్తున్నారని తెలుస్తుంది.

మరి 30 కోట్లకు బిజినెస్ లాక్ అయితే బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసినట్టే.మరి రిలీజ్ సమయానికి ఈ బిజినెస్ డీల్ ఎంతకు క్లోజ్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube