ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ( Congress Party ) ఫుల్ జోష్ లో ఉంది.రాహుల్ గాంధీ( Rahul Gandhi ) చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆ పార్టీకి మంచి మైలేజ్ తెచ్చిందనే చెప్పాలి.
ఆ యాత్ర ప్రభావంతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఘనవిజయాన్ని అందుకుంది.ఏకంగా 135 సీట్లు కైవసం చేసుకొని ప్రత్యర్థి పార్టీలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఇక ప్రస్తుతం విన్నింగ్ జోష్ లో ఉన్న కాంగ్రెస్.
రాబోయే ఎన్నికలపై గట్టిగా దృష్టి పెట్టింది.ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరాం, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.
అయితే తెలంగాణ, మిజోరాం వంటి రాష్ట్రాలను పక్కన పెడితే, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉంది.దాంతో వచ్చే ఎన్నికల్లో కూడా ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీదే పైచేయిగా ఉండే అవకాశం ఉంది.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి అంతా మద్యప్రదేశ్ పైనే ఉంది.ఎందుకంటే 230 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో 114 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీ గా అవతరించిన కాంగ్రెస్ అధికారం కోసం భాహుసమాజ్ వాది పార్టీ లోని ఒక ఎమ్మెల్యే, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కావాల్సివచ్చింది.అయితే ఆ తరువాత పరిణామాలతో 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో ఆ తరువాత బిజెపి ( BJP ) అధికారం చేజిక్కించుకుంది.ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో జరిగిన పరాభవాల కారణంగా ఈసారి పిరాయింపులకు ఏ మాత్రం తవివ్వకుండా గ్రాండ్ విక్టరీ సాధించాలని కాంగ్రెస్ దృఢ నిశ్చయంతో ఉంది.
అందుకే ఈసారి మధ్యప్రదేశ్ లో ఏకంగా 130 సీట్లు సాధించే దిశగా టార్గెట్ ఫిక్స్ చేసుకుంది.కర్నాటకలో ఏ రకమైన వ్యూహాలతో అధికారం చేజిక్కించుకుందో అదే వ్యూహాలను మద్య ప్రదేశ్ లో కూడా అమలు చేయాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ.అయితే ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభావం కూడా మెండుగానే ఉంది.గత ఎన్నికల్లో 109 సీట్లు కైవసం చేసుకున్నా బీజేపీ ఈసారి అంతకుమించి అంటోంది.దాంతో ఈ రెండు పార్టీల మద్య పోరు మరోసారి ఆసక్తికరంగా మరనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.మరి కాంగ్రెస్ ఆశిస్తున్నట్లుగా కర్నాటక సీన్ మద్యప్రదేశ్ లో కూడా రిపీట్ అవుతుందో లేదో చూడాలి.