ఎన్టీఆర్ శత జయంతి( NTR Shathajayanthi ) పుణ్యమా అని ఎన్నో విషయాలను ఇప్పుడు సోషల్ మీడియా వెలికి తీస్తుంది.ఒకప్పుడు మీడియా మాత్రమే వార్తలను చెప్తే వినేవారు.
కానీ ఇప్పుడు ఫోన్ పట్టుకున్న ప్రతి ఒక్కడు రిపోర్టర్ అన్నట్టే ఉంది పరిస్థితి.అసలు విషయం లోకి వెళ్తే ఎన్టీఆర్ ని మోసం చేసిన వారందరు అయన ఉసురు తగిలి కష్టాలను అనుభవిస్తున్నారు అనే వార్త ఒకటి కనిపిస్తుంది.
అందులో చంద్ర బాబు( Chandrababu naidu ), నందమూరి కుటుంబ సభ్యులు, పార్టీ వ్యక్తులు, మీడియా సంస్థలు వంటివి ప్రధాన పాత్ర పోషించాయి.
మొదట మీడియా విషయాన్నీ తీసుకుంటే అప్పట్లో ఎన్టీఆర్ కి వ్యక్తిరేఖంగా మూడు పత్రికలు ప్రముఖం గా పనిచేసాయి.అవి ఈనాడు, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర ప్రభ.ఈనాడు నాడు ఎంత వైభవం గా వర్థిల్లిందో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో కళ్లారా చూసాం.
అంతటి రామోజీ రావు( Ramoji rao ) మంచం పై పడుకొని వీడియో చేయాల్సిన దుస్థితి వచ్చింది.ఇక ఆంధ్ర జ్యోతి మరియు ప్రభ అప్పటి ఓనర్స్ ఇద్దరు ఆ పత్రికను అమ్ముకొని పోయారు.
ఆ పత్రికలో పని చేసిన వారే దాన్ని కొనుక్కుంటే నడిపిన వారు అమ్ముకోవాల్సి వచ్చింది.ఇక చంద్ర బాబు అప్పుడు మామకు చుక్కలు చూపిస్తే ఇప్పుడు జగన్ బాబు( Jagan ) కి చుక్కలు చూపిస్తున్నాడు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి పదేళ్లు, సెపరేట్ ఆంధ్ర కు ఐదేళ్లు ముఖ్య మంత్రి గా ఉన్న బాబు మరోమారు ఆ పీఠం పై కూర్చోవడం అనుమానమే.
ఇక నందమూరి కుటుంబ సభ్యులు కూడా వెన్నుపోటు ఘటనలో కీలకులే.అందుకే కొడుకు, కూతురు, మనవళ్లు అకాల మరణం చెందుతున్నారు.ఆ పార్టీ లో అప్పుడు కీలకం గా బాబు వెంట ఉన్న ఎర్రం నాయుడు.
లాల్ జాన్ బాషా, బాలయోగి , మాధవ రెడ్డి, హరికృష్ణ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు.ప్రతి నాయకుడి మరణం సమయంలోను పెద్దాయన ఉసురు తగిలింది అనే చర్చ జోరుగా సాగింది.
అయితే మొత్తం వ్యవహారం బాగా ఆర్థికం గా లాభపడింది కేవలం మీడియా రిపోర్టర్లు అనేది నిజం.అప్పటి ఈనాడు జర్నలిస్టులు తప్ప మిగతా వారు ఈ విషయంలో బాగా ఆర్థికంగా సెటిల్ అయ్యారు.
ఇక చివరి వరకు ఎన్టీఆర్ ని నమ్ముకున్న ఇంద్ర రెడ్డి కూడా ప్రమాదం లో కన్ను మూసారు.