ఈ ఐపీఎల్ ( IPL )లో మరికొన్ని గంటల్లో క్వాలిఫైయర్-2( Qualifier-2 ) మ్యాచ్ జరుగునున్న సంగతి తెలిసిందే. క్వాలిఫైయర్-1 లో ఓడిన గుజరాత్.
ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన ముంబై ( Mumbai indians )మధ్య గెలిచిన జట్టు ఫైనల్ కు వెళుతుంది.ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది.
కాబట్టి రెండు జట్లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడతాయి.
కానీ క్రికెట్ అభిమానులకు వర్షం కారణంగా నేడు జరిగే మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితి అనే ఆలోచన దాదాపుగా వచ్చే ఉంటుంది.ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే ఫైనల్ లో చెన్నై తో ఏ జట్టు పోటీ పడుతుంది అనే సందేహాలు అందరిలో ఉండే ఉంటుంది.ఇటువంటి సమయాలలో బీసీసీఐ ( BCCI )ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది.
ఎలా సమస్యను పరిష్కరిస్తుంది అనే విషయాలు చూద్దాం.
బీసీసీఐ నియమాల ప్రకారం.
లీగ్ దశలో ఉండే మ్యాచులు వర్షం లేక ఇతర కారణాల వల్ల రద్దు అయితే రెండు జట్లకు చెరోక పాయింట్ ఇస్తారు.ఈ సీజన్లో చెన్నై- లక్నో మధ్య జరిగిన మ్యాచ్ రద్దు అయితే ఇరుజట్లకు చెరో పాయింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్లే ఆఫ్ దశలో ఉండే మ్యాచులు రద్దు అయితే నిబంధనల ప్రకారం గుజరాత్ జట్టు ఫైనల్ కు వెళ్ళి చెన్నై( CSK vs GT ) జట్టుతో టైటిల్ కోసం పోటీ పడుతుంది.ముంబై జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
అది ఎలా అంటే వర్షం కారణంగా ప్లే ఆఫ్ మ్యాచ్ రద్దు అయితే లీగ్ పాయింట్ల పట్టికలో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది.ఈ సీజన్లో గుజరాత్ పది మ్యాచ్లు గెలిచి 20 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
మరి ముంబై జట్టు 14 మ్యాచ్లలో 8 మ్యాచులు గెలిచి 16 పాయింట్లు సాధించింది.కాబట్టి వర్షం పడితే ముంబై జట్టు ఇంటికి.గుజరాత్ జట్టు ఫైనల్ కు వెళుతుంది.