జూన్ రెండు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయం !

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో జూన్ రెండు కు విశేష ప్రాముఖ్యత ఉంది .దశాబ్దాల కలలను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజది.

 Telangana Formation Day Turning Into A Centre For Politics, Telangana Formation-TeluguStop.com

ఇప్పుడు ఈ రోజు కేంద్రం గా తెలంగాణ రాజకీయాలు కాదులుతున్నాయి .రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సంబరంగా జరుపుకోవాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది .21 రోజులు పాటు వేడుకలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బారాస పార్టీ అధినేత మరియు తెలంగాణ ముఖ్య మంత్రి కేసిఆర్( CM KCR ) నిర్ణయించారు .

Telugu Congress, Etela Rajender, Modi, Revanth Reddy, Telangana Day, Ts-Telugu P

అయితే అసలే ఎన్నికల టైం, అవ్వడం తో పొలిటికల్ మైలేజ్ మొత్తం భరాసాకే వెళ్లిపోతుందని ఆలోచిస్తున్న భాజపా కూడా ఈ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయింది .గత సంవత్సరం కూడా ఢిల్లీ వేదికగా ఈ కార్యక్రమాలను భాజపా నిర్వహించింది అప్పుడు అమిత్ షా( Amit sha ) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అయితే ఈసారి అవతరణ దినోత్సవాలను తెలంగాణలోనే నిర్వహించాలని, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోనూ ఘనంగా నిర్వహించి ,ప్రజల్లోకి మంచి సంకేతాలను పంపాలని బాజాపా భావిస్తుంది, ఈసారి ఉత్సవాలకు కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించాలని చూస్తున్నప్పటికీ తక్కువ సమయం ఉన్నందున ప్రధానమంత్రి పర్యటన ఖరారు అవ్వడానికి అవకాశాలు తక్కువే .

Telugu Congress, Etela Rajender, Modi, Revanth Reddy, Telangana Day, Ts-Telugu P

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అవతరణ దినోత్సవాలను నిర్వహించడానికి ముందుకు వచ్చింది పీసీసీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది .ఈ కమిటీ ఉత్సవాలను ఎలా నిర్వహించాలో డిసైడ్ చేస్తుంది అంట.సో ఎన్నికల సమయమైనందున దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని పార్టీలు బలంగా భావిస్తున్నాయి.ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని బారాస భావిస్తుంటే ,ప్రభుత్వ లోపాలను పసిగట్టి వాటిని ప్రజల్లో ఎండగట్టి పొలిటికల్ మైలేజ్ పొందాలని భాజపా చూస్తుంది .పనిలో పనిగా కాంగ్రెస్( Congress party ) కూడా తనదైన శైలిలో ముందుకు వెళుతుంది.సో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాజకీయమంతా తెలంగాణ అవతరణ దినోత్సవం చుట్టూ జరుగుతుందని తెలుస్తుంది ‘

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube