ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ఆర్టిస్టుల( Small artists ) వ్యక్తిగత విషయాలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.ఎందుకంటే ఆ ఆర్టిస్టులు కూడా ఆ రేంజ్ లో తమ వ్యక్తిగత విషయాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి.
ఇక అందులో ఒకరు జబర్దస్త్ ఫైమా( Jabardast Faima ) అని చెప్పాలి.చిన్న ఆర్టిస్ట్ అయినప్పటికీ కూడా క్రేజ్ మాత్రం బాగా సంపాదించుకుంది.
ఒక సామాన్య అమ్మాయైనా ఇప్పుడు సెలబ్రిటీ హోదాలో ఉందని చెప్పాలి.ఉండటానికి కనీసం సొంతిల్లు లేని ఫైమా జీవితం ఇప్పుడు ఇలా ఉంది అంటే దానికి కారణం ఆమెలో ఉన్న టాలెంట్ అని చెప్పాలి.
రెక్కలాడితేనే పూట గడిచే తన కుటుంబం కు ఫైమా ఆదర్శమని చెప్పాలి.నిరుపేద బ్రతుకు బతికే ఫైమా తల్లిదండ్రులు చిన్న కూలీ పని చేస్తూ ఫైమా తో పాటు మరో ముగ్గురు ఆడపిల్లల బాధ్యతలు తలపై పెట్టుకుని అందులో ఇద్దరి అమ్మాయిలకు పెళ్లి చేసి మరో ఇద్దరి పెళ్లిళ్ల కోసం కష్టపడుతున్నాడు.

ఇక ఆ సమయంలోనే తన చిన్న కూతురు అయిన ఫైమా వారి కష్టాలను దూరం చేసింది.ఫైమా చదువుకునే రోజుల్లో గతంలో పటాస్ షోకు స్టూడెంట్ గా వచ్చి అక్కడ తన కామెడీతో అందరిని నవ్వించింది.దీంతో యాంకర్ రవి( Anchor Ravi ) తన టాలెంట్ ను తనకు పటాస్ షోలో( Patas show ) అవకాశం ఇచ్చాడు.సినీ ప్రపంచమనే మాయ లోకానికి తన తల్లిదండ్రులు ఫైమాను పంపించడానికి నిరాకరించినప్పటికీ కూడా ఫైమా బలవంతంతో ఒప్పుకున్నారు.
కానీ ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తూ వారిని కాపాడుతుంది.ఇక పటాస్ షోలో చేసిన తర్వాత కొంతకాలానికి జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టింది.
ముక్కు అవినాష్, కెవ్వు కార్తీక్ లో టీంలో నటించే అవకాశం వచ్చింది.ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీం లో కూడా నటించింది.
ఇక జబర్దస్త్ లోనే ఉండగానే ఆమెకు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అవకాశం వచ్చింది.ఇక అక్కడ కూడా తన కామెడీ టైమింగ్ తో బాగా సందడి చేసింది.

ఇక షో నుండి బయటకు వచ్చాక కూడా బాగా బిజీగా మారింది ఫైమా.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా మారింది.గెటప్ మొత్తం మార్చేసింది.అయితే ఇదంతా పక్కన పెడితే.ఫైమా మరో జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్( Jabardast comedian Praveen ) తో ప్రేమాయణం చేస్తున్న సంగతి తెలిసిందే.బిగ్బాస్ సమయంలో వీరి మధ్య ఉన్న ప్రేమ రహస్యం బయటపడింది.
ఇక అప్పటినుంచి ఇద్దరు కలిసి వీడియోలు తీయడం.ఒకరి గురించి ఒకరు అన్నట్లుగా ఉండటం ఇలా అందరి దృష్టిలో పడ్డారు.
ప్రవీణ్ కూడా జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు.అయితే రీసెంట్ గా ఆయన మరో అమ్మాయి తో పెళ్లి చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేయటంతో ఫైమా ఫాన్స్ అతనిపై ఫైర్ అవుతున్నారు.
ఫైమాను ప్రవీణ్ వదిలేసాడా అంటూ షాక్ అవుతున్నారు.దీంతో సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలకు స్పందించాడు ప్రవీణ్.
కొమరం యూట్యూబ్ ఛానల్ కోసం చేసిన వీడియో అని కానీ అది నిజంగా జరిగిన పెళ్లి అయితే కాదని.తన లైఫ్ లో ఫైమా తప్ప వేరే అమ్మాయి లేదని అన్నాడు.
దీంతో ఫైమా అభిమానులు అప్పుడు కూల్ అయ్యారు.ఇక వీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.
కానీ అది ఎప్పుడూ అనే విషయం మాత్రం ఇంకా తెలియలేదు.