గతేడాది రిలీజైన సినిమాలలో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమా ఏదనే ప్రశ్నకు లైగర్ సినిమా( Liger Movie ) పేరు సమాధానంగా వినిపిస్తుంది.ఈ సినిమా మిగిల్చిన నష్టాల వల్ల పూరీ జగన్నాథ్, ఛార్మీ పరువు కూడా పోయింది.
డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు భారీ మొత్తంలో నష్టాలు రావడంతో ఆ భారీ నష్టాలను భర్తీ చేసే విషయంలో పూరీ జగన్నాథ్, ఛార్మీలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా ద్వారా లైగర్ బ్యూటీ అనన్య పాండేకు( Ananya Panday ) ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చిందనే సంగతి తెలిసిందే.
తెలుగులో ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు లేకపోయినా హిందీలో మాత్రం అనన్య పాండే హవా బాగానే ఉందని సమాచారం అందుతోంది.ఈ బ్యూటీ పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
అయితే ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు( Umair Sandhu ) ఈ బ్యూటీ గురించి సంచలన ఆరోపణలు చేశారు.
అనన్య పాండే శృంగారానికి బానిసైందంటూ ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.లైగర్ సినిమాలో చెత్త యాక్టింగ్ తో క్రిటిక్స్, ప్రేక్షకుల నుంచి విమర్శలు మూటగట్టుకున్న ఈ బ్యూటీ బాయ్ ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్ తో( Aditya Roy Kapoor ) రాత్రి పగలు గడుపుతోందని ఉమైర్ సంధు అన్నారు.తాజాగా అనన్య పాండే ఉర్దూలో ఒక టాటూను వేయించుకోగా ఆ టాటూ సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిందనే సంగతి తెలిసిందే.
భాగీ అనే పేరును అనన్య పాండే తన మోచేతిపై టాటూగా వేయించుకోవదం జరిగింది.భాగీ అంటే రెబల్ అని అర్థమని ఉమైర్ సంధు అన్నారు.అనన్య పాండే వేయించుకున్న టాటూను చూపిస్తూ ఉమైర్ సంధు ఈ కామెంట్లు చేయడం గమనార్హం.ఉమైర్ సంధు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఉమైర్ సంధు కామెంట్ల విషయంలో అనన్య పాండే ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.