అలా అవమానిస్తే ఎన్టీఆర్ ఎందుకు పట్టించుకోవాలి.. ఫైర్ అవుతున్న తారక్ ఫ్యాన్స్!

సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు( NTR centenary celebrations ) జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.ముందుగానే ఫిక్స్ చేసుకున్న ప్లాన్స్ వల్ల తారక్ ఈ ఈవెంట్ కు హాజరు కాలేదు.

 This Is The War Between Balakrishna And Tarak Details Here Goes Viral In Social-TeluguStop.com

ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్( NTR ) హాజరు కావడం చంద్రబాబు, బాలయ్యలకు ఇష్టం లేదని అందువల్లే మే 20వ తేదీన ఈ ఈవెంట్ ను ప్లాన్ చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ ను ఈవెంట్ కు ఆహ్వానించడం వాస్తవమేనని అయితే అయితే మే 20వ తేదీన కాకుండా మరో తేదీన ఈ ఈవెంట్ ను నిర్వహించడానికి సమస్య ఏంటని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తారకరత్న( Tarakaratna ) మరణించిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ లేచి నిలబడినా బాలయ్య పట్టించుకోలేదని మళ్లీ మళ్లీ అవమానాలు ఎదురవుతాయని భావించి తారక్ ఈ ఈవెంట్ కు హాజరు కాలేదని మరి కొందరు చెబుతున్నారు.

Telugu Balakrishna, Nandamuri, Ntr Centenary, Tarak, Tarakaratna, Tollywood-Movi

అలా అవమానిస్తే ఎన్టీఆర్ ఎందుకు పట్టించుకోవాలంటూ తారక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.బాలయ్య ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది.బాలయ్య( Balayya ), ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపిస్తే మాత్రమే బాలయ్య ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గ్యాప్ తగ్గే ఛాన్స్ ఉంటుంది.

బాలయ్య, తారక్ తమ మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు.

Telugu Balakrishna, Nandamuri, Ntr Centenary, Tarak, Tarakaratna, Tollywood-Movi

బాలయ్య, ఎన్టీఆర్ కలిసి నటిస్తే చూడాలని ఉందని అభిమానులు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.రాబోయే రోజుల్లో బాలయ్య, తారక్ కలిసి నటించి అభిమానులను సంతోషానికి గురి చేస్తారేమో చూడాల్సి ఉంది.బాలయ్య అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉండగా ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు.

బాలయ్య అనిల్ కాంబో మూవీ టైటిల్ కు సంబంధించిన ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube