ఈ ఐపీఎల్ సీజన్-16 లీగ్ మ్యాచ్లు నేడు ఆదివారం మే 21తో ముగియనున్నాయి.గుజరాత్, చెన్నై, లక్నో( Gujarat, Chennai, Lucknow ) జట్లు ప్లే ఆఫ్ బెర్త్ కాయం చేసుకున్నాయి.
మిగిలిన ఒక్క స్థానం కోసం ఇంకా కొన్ని జట్లు రేసులో కొనసాగుతున్నాయి.ప్లే ఆఫ్ బెర్త్ కోసం ముంబై, బెంగుళూరు, రాజస్థాన్ జట్ల మధ్య భారీ పోటీ నెలకొంది.
ఈ నేపథ్యంలో రాజస్థాన్ జట్టు( Rajasthan ) కు అన్ని లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాయి.ప్రస్తుతం రాజస్థాన్ ఐదో స్థానంలో కొనసాగుతుంది.
ఈరోజు జరిగే రెండు మ్యాచ్ ల ఫలితాలపై రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ చేరే అవకాశం ఆధారపడి ఉంది.

ముంబై- హైదరాబాద్( Mumbai-Hyderabad ) మధ్య జరిగే కీలకమైన మ్యాచ్లో భారీ పరుగుల తేడాతో ముంబై గెలిస్తేనే ప్లే ఆఫ్ కు చేరే అవకాశం ఉంటుంది.అంతేకాకుండా ముంబై గెలిచిన గుజరాత్- బెంగుళూరు మధ్య జరిగే మ్యాచ్ లో బెంగుళూరు ఓడిపోతేనే ముంబై ప్లే ఆఫ్ కు చేరుతుంది.ముంబై, బెంగళూరు, రాజస్థాన్ జట్లు 14 పాయింట్లతో సమానంగా ఉండి నెట్ రన్ రేట్ పరంగా వివిధ స్థానాలలో ఉన్నాయి.
కాబట్టి ముంబై, బెంగుళూరు ఓడితే రాజస్థాన్ ప్లే ఆఫ్ చేరుతుంది.

ఇక బెంగళూరు జట్టుకు నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడం కలిసి వచ్చే అవకాశం ఉంది.నేడు జరిగే మ్యాచ్లో గుజరాత్ పై గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం అవుతుంది.ఒకవేళ ఓడిన ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగానే ఉంటాయి.
అది ఎలా అంటే ముంబై జట్టు తన చివరి మ్యాచ్లో ఓడిపోవడంతో పాటు గుజరాత్ చేతిలో బెంగుళూరు ఆరు పరుగుల కంటే తక్కువ తేడాతో ఓడితేనే బెంగుళూరు ప్లే ఆఫ్ ( Bangalore play off )చేరుతుంది.ఇక రాజస్థాన్ కంటే బెంగుళూరు నెట్ రన్ రేట్ మెరుగ ఉండడంతో బెంగళూరు జట్టు గుజరాత్ చేతిలో 6 పరుగుల కంటే తక్కువ తేడాతో ఓడిన బెంగుళూరు ప్లే ఆఫ్ కు చేరుతుంది.
అలాకాకుండా ఆరు పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఓడితే రాజస్థాన్ ప్లే ఆఫ్ కు చేరుతుంది.నాలుగో స్థానంలో ఏ జట్టు నిలుస్తుందో చివరి మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే.