రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బంది ,హోం గార్డ్స్ వారి కుటుంబాల సంక్షేమం దృష్ట్యా ఐ ఎం ఏ(ఇండయన్ మెడికల్ కౌన్సిల్) వారి, సన్ షైన్ హాస్పిటల్ కరీంనగర్ వారి సహకారంతో కరీంనగర్ సన్ షైన్ హాస్పిటల్( Sunshine Hospitals) లో మే 20 నుండి జూన్ 12 వరకు ఉచిత గుండె, ఆర్తో వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని అధికారులు సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని ఎస్పి అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) సూచించారు.
పోలీస్ అధికారులు,సిబ్బంది ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని,సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు దినచర్య, జీవన విధానం మిగతావారితో పూర్తి భిన్నంగా ఉంటుందని, ఇందుకుగానూ మన ఆరోగ్య పరిరక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకొనక తప్పదని అన్నారు.
పోలీస్ అధికారులకు, సిబ్బంది ,హోం గార్డ్స్ కు ఉచిత గుండె, ఆర్తో వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్న సన్ షైన్ హాస్పిటల్ హాస్పిటల్ యాజమాన్యనికి, ఐఎంఏ(ఇండయన్ మెడికల్ కౌన్సిల్) వారి కి ఎస్పీ కృతజ్ఞతలు అభినందనలు తెలపడం జరిగింది.ఈ సందర్భంగా సన్ షైన్ హాస్పిటల్ కరీంనగర్ ,పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే వైద్య శిబిరానికి సంబంధించిన పోస్టర్ ను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు.
ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,డాక్టర్ సురేష్,సన్ షైన్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.







