ఊరెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త..

రాజన్న సిరిసిల్ల జిల్లా:వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) హెచ్చరించారు.ఊరికి వెళ్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల అవగాహన కల్పిస్తూ జిల్లా పోలీస్ శాఖ తరుపున రూపొందించిన కరపత్రాన్ని ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో కలసి అవిష్కరించారు.

 Tasmat, Be Careful , Sp Akhil Mahajan, Cc Cameras-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు పలు సూచనలు చేసారు.ఇంట్లోని బంగారు అభరణాలు, నగదును భద్రపర్చుకోవాలని లేదా బ్యాంకు లాకర్ లో భద్రపర్చుకోవాలి.

బీరువా తాళాలు ఇంటిలోనే ఉంచకుండా తమవెంట తీసుకొని పోవాలని.విలువైన వస్తువులు, వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్పరాదు.

ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ సిస్టంను, సిసి కెమరాలను ఏర్పాటు చేసుకోవాలి.ఐపి సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మీ ఇంటి స్థితిగతులను మొబైల్లో వీక్షించవచ్చని.

ఎట్టి పరిస్థితుల్లో బయట గేటు తాళం వేయకూడదు, లోపలి నుండి బేదం పెట్టాలి.ఇంటిలోపల లైట్ వేసి ఉంచి, ఇంటి లోపల బయల లైటు వేసి వుంచాలి.

అపార్ట్మెంట్లో సిసి కెమెరాలు లేదా వాచ్మెన్ ఏర్పాటు చేసుకోవాలి.సంబంధిత పోలీస్ స్టేషన్,వీపీవో /డబ్ల్యూపిఓ కానిస్టేబుల్ సమాచారం ఇవ్వగలరు.

ప్రజలు పోలీసులు సమన్వయం కలిసి పనిచేస్తే చోరీలను నియంత్రించుకోగలము.ఇండ్లకు తాళం వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు ప్రక్కల వారికి, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలి.

ఎవరైన కాలనీలోని, ఆపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో అనుమానస్పద కోత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లుగా గమనిస్తే తక్షణమే స్థానిక పోలీస్ లేక డయల్ 100, సమాచారం అందించగలరని ప్రజలకు సూచించారు.స్థానిక నివాసితులు సంఘాలను ఏర్పాటు చేసుకొని రాత్రి వేళల్లో గస్తీ తిరుగవచ్చిను.

దొంగతనాలను అరికట్టడానికి 50 నుండి 100 మంది సంఘం గా ఏర్పడి వారి ప్రాంతలకి గస్తీ తిరగడానికి వాచ్ మెన్ ను ఏర్పాటు చెలుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube