ఐపీఎల్ లో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచులు అన్ని కీలకమే.నేడు 3:30 గంటలకు అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ- చెన్నై మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.ప్రస్తుతం 15 పాయింట్ లతో ఉన్న చెన్నై జట్టుకు ఈ మ్యాచ్ కీలకం.ఈ మ్యాచ్లో గెలిస్తే ఇతర జట్లతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ కాయం అవుతుంది.
కానీ చెన్నై జట్టు రెండో స్థానంలో ఉంటుందా లేకుంటే మూడో స్థానంలో ఉంటుందా అనేది మాత్రం నేడు జరిగే తర్వాతి మ్యాచ్ పై ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ ఢిల్లీ చేతిలో చెన్నై జట్టు ఓడితే ఆదివారం జరిగే మ్యాచ్ ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది.
నేడు జరిగే మ్యాచ్లో ఢిల్లీ జట్టు గెలిస్తే ఈ సీజన్లో ఆఖరి స్థానం నుండి తప్పించుకునే అవకాశం తప్ప ప్రయోజనం ఏమీ లేదు.కాబట్టి ఈ మ్యాచ్ లో గెలుపు చెన్నై జట్టుకు ఎంతో అవసరం.

అంతేకాకుండా నేటి సాయంత్రం ఈడెన్ గార్డెన్స్ వేదికగా 7:30 గంటలకు లక్నో – కోల్ కత్తా మధ్య కీలక పోరు జరుగనుంది.ఈ మ్యాచ్లో కోల్ కత్తా గెలిచినా కూడా ప్లే ఆఫ్ చేరడం కష్టమే.కానీ లక్నో జట్టు నేరుగా ప్లే ఆఫ్ చేరాలంటే ఈ మ్యాచ్ ఎంతో కీలకం.ప్రస్తుతం 15 పాయింట్లతో ఉన్న లక్నో ఈ మ్యాచ్లో గెలిస్తే 17 పాయింట్లు ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది.
అలాకాకుండా ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడాల్సిందే.

ఇక కోల్ కత్తా ప్రస్తుతం 12 పాయింట్లతో -0.256 నెట్ రన్ రేట్ తో ఉంది.లక్నోపై విజయం సాధించిన కూడా 14 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరలేదు.
ఒకవేళ ప్లే ఆఫ్ చేరాలంటే నెట్ రన్ రేట్ భారీగా మెరుగుపరచుకోవాలి.ఇలా జరగడం అసాధ్యం కావడంతో కోల్ కత్తా కు ప్లే ఆఫ్ చాన్స్ లేనట్టే.
ఇక ప్లే ఆఫ్ రేసులో మిగిలిన మూడు స్థానాల కోసం చెన్నై, లక్నో, బెంగుళూరు, ముంబై, రాజస్థాన్ జట్లు పడుతున్నాయి.