యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోని బెస్ట్ డైలాగ్స్ ఇవే.. ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చేలా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) సినిమాలలో డైలాగ్స్ మరింత స్పెషల్ గా ఉంటాయనే సంగతి తెలిసిందే.కొన్ని డైలాగ్స్ వల్లే జూనియర్ ఎన్టీఆర్ మరింత పాపులర్ అయ్యారు.

 Young Tiger Ntr Career Best Dialogues Details, Junior Ntr, Ntr Best Dialogues, N-TeluguStop.com

ఎన్టీఆర్ పుట్టినరోజు( NTR Birthday ) సందర్భంగా ఆయన సినీ కెరీర్ లోని బెస్ట్ డైలాగ్స్ గురించి సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన కొన్ని డైలాగ్స్ వింటే ఫ్యాన్స్ కు సైతం పూనకాలు వస్తాయనే సంగతి తెలిసిందే.

ఆది సినిమాలో( Adi Movie ) తారక్ “అమ్మతోడు అడ్డంగా నరికేస్తా” అంటూ చెప్పిన డైలాగ్ ఆ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

Telugu Adi, Devara, Ntr, Simhudu, Ntr Dialogues, Oosaravelli, Samba, Temper-Movi

“పదిమంది చల్లగా ఉండటం కోసం నేను చావడానికైనా, చంపటానికైనా సిద్ధం ” అంటూ సింహాద్రి సినిమాలో తారక్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

సాంబ( Samba ) సినిమాలో “నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావ్.నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావ్.

ఈ సాంబతో పెట్టుకుంటే చచ్చిపోతావ్” అనే డైలాగ్ ప్రేక్షకులను మెప్పించింది.

ఊసరవెల్లి సినిమాలో “కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిగా కానీ టచ్ చేస్తే దానమ్మ షాకే సాలిడ్ గా ఉంటుంది” అనే డైలాగ్ ప్రేక్షకులను అలరించింది.

Telugu Adi, Devara, Ntr, Simhudu, Ntr Dialogues, Oosaravelli, Samba, Temper-Movi

బాద్ షా సినిమాలో బాద్ షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది అంటూ తారక్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను మెప్పించింది.

టెంపర్ సినిమాలో “ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం.అదే ఒకడు మీదడిపోయే.దండయాత్ర.ఇది దయ గాడి దండయాత్ర” అనే డైలాగ్ ప్రేక్షకులకు తెగ నచ్చింది.

ఆర్.

ఆర్.ఆర్ సినిమాలో “తొంగితొంగి నక్కినక్కి గాదె.తొక్కుకుంటూ పోవాలె.ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలె” అని తారక్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

Telugu Adi, Devara, Ntr, Simhudu, Ntr Dialogues, Oosaravelli, Samba, Temper-Movi

జనతా గ్యారేజ్ సినిమాలో “బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బ్రతకడం ఆనవాయితీ.బట్ ఫర్ ఏ ఛేంజ్.ఆ బలహీనుడి పక్కన కూడా బలం ఉంది” అనే డైలాగ్ ప్రేక్షకులను మెప్పించింది.

దేవర( Devara Movie ) సినిమాలో “అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలీదు అవసరానికి మించి తను ఉండకూడదని.అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని.వస్తున్నా” అంటూ తారక్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

నరసింహుడు సినిమాలోని రేయనక పగలనక, యమదొంగ సినిమాలోని ఏమంటివీ.ఏమంటివీ, రాఖీ సినిమాలోని ఆఫ్ట్రాల్ కాదు సార్ అంటూ తారక్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube