వివాదాలతో హిట్లు గా మారిన సినిమాలు ఇవే...

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొన్ని సినిమాలు హిట్ అయితే మరికొన్ని సినిమాలు రిలీజ్ అవ్వగానే వివాదాల దారి పడుతాయి అలా ఎందుకు అవుతుంది అని మనకు అనిపించవచ్చు.దానికంటే ముందు ఒకసారి ఇండస్ట్రీ లో ఉన్న హీరోల గురించి తెలుసుకుందాం…చాలా మంది హీరోలు ఈ చిత్ర పరిశ్రమలో వారసత్వంగా హీరోలు కాగా, మరికొంతమంది కష్టపడి పైకి వచ్చారు.

 These Are The Movies That Became Hits With Controversies Details, Komaram Puli,t-TeluguStop.com

ఇక మరికొందరు తమ కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో ఉండటం కారణంగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు.కొంతమంది ఎదిగితే, కొంతమంది రాణించలేకపోతున్నారు.

ఇక అసలు మ్యాటర్ లోకి వస్తె వెబ్ మీడియా, సోషల్ మీడియా పెరిగాక నటి నటులు ఏం మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది.ఇది ఇలా ఉండగా, పలు చిత్రాల్లోని కొన్ని సన్నివేశాల వల్ల వివాదాలు వస్తూ ఉండటంతో వాటిని డిలీట్ చేసి మూవీస్ ని రిలీజ్ చేస్తున్నారు.

 These Are The Movies That Became Hits With Controversies Details, Komaram Puli,T-TeluguStop.com

ఇప్పుడు ఆ లిస్టులో ఉన్న కొన్ని మూవీ గురించి తెలుసుకుందాం…

ముకుంద


వరుణ్ తేజ్ మొదటి సినిమా అయిన ముకుంద సినిమా టైటిల్ విషయం లో అప్పుడు చాలా వివాదాలు జరిగాయి అయితే ముకుంద సినిమా టైటిల్ మొదట గా గొల్లబామ అని పెట్టారు.దానికి యాదవ సంగమం సమితి వారు అబ్జెక్షన్ చెప్పి ఆ టైటిల్ ని తిసి వేయమనడం తో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల పేరు మార్చి ముకుందా అని పెట్టాడు…

అర్జున్ రెడ్డి


సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరో గా వచ్చిన ఈ మూవీలో అభ్యంతరకరమైన సీన్స్ ఎక్కువగా ఉన్నాయి అని కొందరు రాజకీయ నాయకులు సినిమా పోస్టర్లను చించేశారు కూడా.

కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది…

సర్కార్ వారి పాట


ఈ మూవీ సెకండ్ హాఫ్ లో మహేష్, కీర్తి సురేష్ ని బ్లాక్ మెయిల్ చేసి తన పక్కన పడుకోమని అడుగుతాడు.అప్పుడు ఆమెపై కాలు కూడా వేస్తాడు.

ఈ సన్నివేశంపై వివాదాలు రావడంతో డైరెక్టర్ పరుశురామ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ అవి ఫలించలేదు.

Telugu Arjun Reddy, Cemeramanganga, Latest Ups, Daruvu, Komaram Pili, Komaram Pu

రంగస్థలం


చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలంపై కూడా ఓ వివాదం మొదలు అయింది.సినిమాలోని రంగమ్మ మంగమ్మ అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలియంది కాదు.ఎక్కడ చూసిన ఈ పాట మారుమ్రోగిపోతుంది.అయితే ఈ పాటలో గొల్లభామ వచ్చి గొల్లుగిల్లుతుంటే అనే పదాలు తమ జాతి ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బ తినేలా ఉన్నాయని యాదవ సంఘం డిమాండ్ చేశారు.

దరువు


రవితేజ సినిమాకి టైటిల్ వివాదాస్పదమైంది.దరువు అనేది తమ సాంస్కృతిలో భాగం అని తెలంగాణ సాంస్కృతి సంఘం వ్యతిరేకించింది.చివరకు వారిని నిర్మాత ఒప్పించి సినిమాని రిలీజ్ చేసుకున్నారు.

Dj దువ్వాడ జగన్నాధం


మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం డీజే.అప్పట్లో ఈ మూవీపై ఎన్నో వివాదాలు వచ్చాయి.

ఈ మూవీలో ఒక సీన్ లో అల్లు అర్జున్ గాయత్రి మంత్రం జపిస్తూ విలన్స్ తో ఫైట్ చేస్తాడు.ఆ టైములో అల్లు అర్జున్ కాళ్ళకి చెప్పులు ఉండటంపై పలు అభ్యంతరాలు వచ్చాయి.

Telugu Arjun Reddy, Cemeramanganga, Latest Ups, Daruvu, Komaram Pili, Komaram Pu

కెమెరామెన్ గంగ తో రాంబాబు
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, పవర్ స్టార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంలో కొన్ని రాజకీయ పార్టీలను ఉద్దేశించిన డైలాగ్స్ ఉన్నాయంటూ కొందరు వివాదం సృష్టించారు.కానీ ఈ మూవీ అలాగే రిలీజ్ అయింది…

పులి


పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన పులి విషయం లో కూడా టైటిల్ వివాదం అయింది.ఈ సినిమాకి మొదట గా కొమరం పులి అని పేరు పెట్టారు అయితే తెలంగాణ బబ్బిలి అని పిలుచుకునే కొమరం భీమ్ పేరు లోని కొమరం అనే టైటిల్ పెట్టుకోవడంతో కొంత మంది దానికి అబ్జెక్షన్ చెప్పారు దాంతో పులి అనే పేరు తో ఈ సినిమాను రిలీజ్ చేశారు…

ఇక ఇంకా చాలా సినిమాలు వివాదాల బారిన పడి మంచి సక్సెస్ లు సాధించిన చిత్రాలు గా నిలిచాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube