ఒక ఫన్నీ సంఘటనలో ఒక ధైర్యవంతురాలైన యువతి( Woman ) ఇద్దరు దొంగలను పిచ్చి కొట్టుడు కొట్టింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ( Social Media )వైరల్‌గా మారింది.
దీన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.మరి కొందరు ఆ మహిళ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
తన బ్యాగ్ కాపాడుకోవాలనే క్రమంలో సదరు మహిళ చూపించిన అచంచలమైన ధైర్యాన్ని, దృఢనిశ్చయాన్ని పొగుడుతున్నారు.

వైరల్ వీడియోలో దొంగలు బైక్‌పై వెళుతూ ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ను లాక్కోవడానికి ప్రయత్నించడం మీరు చూడవచ్చు.కాగా సదరు యువతి హ్యాండ్‌బ్యాగ్‌ను వదిలేయడానికి నిరాకరించింది.తన బ్యాగ్ పట్టీని గట్టిగా పట్టుకుంది.
దాంతో స్నాచర్ దానిని దొంగిలించలేకపోయాడు.ఆమె గట్టిగా పట్టుకున్న ఫోర్స్ వల్ల బైక్‌పై నుంచి ఆ ఇద్దరు దొంగలు కింద పడ్డారు.
ఇది గమనించిన యువతి వారి వైపు పరిగెత్తింది.ఒక దొంగ గల్లా పట్టుకుని అతని చెంప పగులకొట్టింది.
ఇంకొక దొంగపై కూడా దాడి చేసింది.

అయితే ఆ స్నాచర్ల ఆగడాలు అంతటితో ఆగలేదు.విఫలమైన దోపిడీ వల్ల వారి బైక్ పోయింది.యువతి దొంగను పిచ్చిపిచ్చిగా తన్నింది.
ఆమె నుంచి దొంగ ప్రాణాలు కాపాడేందుకు అటువైపుగా వెళ్లేవారు కలుగజేసుకోవాల్సి వచ్చింది.ఆమెను శాంతపరిచేందుకు చూపరులు చాలా కష్టపడాల్సి వచ్చింది.
@viciousvideos అనే ట్విట్టర్( Twitter ) పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 40 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.వందల్లో లైకులు వచ్చాయి.
ఆ యువతి పాకిస్థాన్ లేడీ అయి ఉంటుందని ఒక నైటిజన్ ఫన్నీగా కామెంట్ పెట్టారు.ఈ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందని మరికొందరు కామెంట్లు చేశారు.
దీనిని మీరు కూడా చూసేయండి.







