ఈ ఐపీఎల్ సీజన్లో తాజాగా జరిగిన ఢిల్లీ-పంజాబ్( DC vs PBKS ) మధ్య సాగిన మ్యాచ్ చాలా థ్రిల్లింగ్ గా సాగింది.పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే ఈ మ్యాచ్ ఎంతో కీలకం.
ఢిల్లీ జట్టు చెత్త ఫీల్డింగ్ చేసిన కూడా పంజాబ్ జట్టు గెలవలేకపోయింది.చివరకు 15 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
టాస్ ఓడిన ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 213 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.ఢిల్లీ జట్టు బ్యాటింగ్లో అద్భుతం చేసి, ఫీల్డింగ్ లో మాత్రం పేలవ ఆటను ప్రదర్శించింది.
అయినా కూడా మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఘనవిజయం సాధించింది.ఢిల్లీ జట్టు ఫీల్డింగ్ లో చేసిన తప్పిదాలు ఏమిటో చూద్దాం.

214 పరుగుల లక్ష్య చేదనకు దిగిన పంజాబ్ జట్టు 8 ఓవర్లకు 55 పరుగులు చేసింది.కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేసిన ఎనిమిదవ ఓవర్లో ఆఖరి బంతికి లివింగ్ స్టోన్ ఇచ్చిన సులభమైన క్యాచ్ ని ఆన్రీచ్ నోకియా మిస్ చేశాడు.డైరెక్ట్ చేతికి వచ్చిన క్యాచ్ మిస్ అయినప్పుడు లివింగ్ స్టోన్( Living stone ) స్కోరు కేవలం మూడు పరుగులే.తర్వాత కుల్దీప్ యాదవ్( Kuldeep yadav ) వేసిన పదవ ఓవర్లో అథర్వ టైడ్ ఇచ్చిన క్యాచ్ ను యష్ ధుల్ మిస్ చేశాడు.అప్పుడు అథర్వ టైడ్ స్కోర్ కేవలం 36 పరుగులే.
11వ ఓవర్లో లివింగ్ స్టోన్, అథర్వ టైడ్ లు రన్ అవుట్ నుండి తప్పించుకున్నారు.ఇదే 11వ ఓవర్లో ఆఖరి బంతికి డైరెక్ట్ హిట్ మిస్ కావడంతో ఓవర్ త్రోలో సింగల్ వేసేందుకు పంజాబ్ బ్యాటర్లు ప్రయత్నించారు.అప్పుడు కూడా రనౌట్ నుండి తప్పించుకున్నారు.
అంటే ఏకంగా ఒకే ఓవర్ లో రెండుసార్లు రన్ అవుట్ నుండి తప్పించుకున్నారు.అంతే కాదు ఆ తర్వాత ఓవర్లో అథర్వ కు మరో లైఫ్ లభించింది.

ఇక చివరి ఓవర్లో 33 పరుగులు చేయాల్సి ఉండగా లివింగ్ స్టోన్ మొదటి బంతికి సిక్స్, రెండవ బంతికి ఫోర్, మూడవ బంతికి సిక్స్ బాదాడు.మూడవ బంతి నో బాల్ కావడంతో పంజాబ్ జట్టుకు మరో లైఫ్ లభించింది.ఇక చివరి మూడు బంతులకు 16 పరుగులు చేయాల్సి ఉండగా లివింగ్ స్టోన్ పరుగులు చేయకుండా ఆఖరి బంతికి ఔట్ అయ్యాడు.అంతే కాకుండా ఢిల్లీ జట్టు చెత్త ఫీల్డింగ్ కు అనవసర బంతులు కూడా బౌండరీలు దాటాయి.
అయిన కూడా 15 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు ఘోర పరాజయం పొందింది.








