మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో బెయిల్ రద్దు షరతులపై సీజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
బెయిల్ రద్దు చేసి పలానా తేదీన మళ్లీ విడుదల చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులపై సీజేఐ ఆశ్చర్యం కనబరిచింది.ఈ నేపథ్యంలో విచారణను వెకేషన్ బెంచ్ కు ధర్మాసనం బదిలీ చేసింది.
అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.కాగా వచ్చేవారం సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది.







