టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ డిజాస్టర్ తర్వాత ఖుషి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.సమంత సైతం శాకుంతలం డిజాస్టర్ తర్వాత నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
గతంలో మహానటి సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించగా అదే కాంబినేషన్ లో మళ్లీ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.అయితే విజయ్ దేవరకొండ వయస్సు 34 సంవత్సరాలు కాగా సమంత వయస్సు 36 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండ, సమంత మధ్య రెండేళ్ల ఏజ్ గ్యాప్ ఉండగా తాజాగా విడుదలైన ఖుషి మూవీ పోస్టర్లను చూసిన నెటిజన్లు విజయ్ దేవరకొండకు సమంత అక్కలా ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.సమంత గురించి ఈ మధ్య ఎక్కువగా నెగిటివ్ కామెంట్లు వస్తుండటంతో అభిమానులు ఒకింత ఫీలవుతున్నారు.సమంతకే అన్ని కష్టాలు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
విజయ్ సమంత జోడీపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఖుషి సినిమాతో ఈ జోడీ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుండగా ఈ వెబ్ సిరీస్ కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సమంత సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోలు సమంతకు ఛాన్స్ ఇస్తే ఆమె కెరీర్ పుంజుకునే ఛాన్స్ ఉంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సమంత రేంజ్ పెరుగుతుండగా ఈ ఏడాది ఆమెకు కలిసొస్తుందో చూడాల్సి ఉంది.ఖుషి అనే టైటిల్ ను ఫిక్స్ చేయడం విషయంలో ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ ఖుషి మ్యాజిక్ ను ఈ ఖుషి రిపీట్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.







