బిచ్చగాడు సినిమాకు మహేష్ బాబు సెట్ అవుతారు.. విజయ్ ఆంటోని షాకింగ్ కామెంట్స్!

మరో రెండు రోజుల్లో బిచ్చగాడు2 సినిమా థియేటర్లలో విడుదల కానుంది.సినిమా రిలీజ్ కు ముందే సినిమాలోని కొన్ని కీలక సీన్లను యూట్యూబ్ లో రిలీజ్ చేసి మేకర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.

 Vijay Antony Shocking Comments About Mahesh Babu Details Here Goes Viral , Vija-TeluguStop.com

బిచ్చగాడు సినిమా కొన్నేళ్ల క్రితం థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఆ సినిమా సంచలన విజయం వల్ల బిచ్చగాడు2 థియేట్రికల్ హక్కులు ఏకంగా 6 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.

బిచ్చగాడు2( bichhagadu 2 ) సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా 6 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడం కష్టం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బిచ్చగాడు సిరీస్ సినిమాలలో మీరు నటించకుండా ఉండి ఉంటే మీ స్థానంలో ఏ హీరో అయితే బాగుంటారనే ప్రశ్న విజయ్ ఆంటోనికి ఎదురైంది.

ఆ ప్రశ్నకు విజయ్ ఆంటోని( Vijay Antony ) సమాధానం ఇస్తూ బిచ్చగాడు మూవీలోని పాత్ర హావభావాలను మహేష్ బాబు( Mahesh Babu ) అద్భుతంగా పలికించగలరని తెలిపారు.

Telugu Ajith, Bichhagadu, Mahesh Babu, Tollwood, Vijay Antony-Movie

తమిళంలో అయితే విజయ్ కానీ అజిత్ ( Ajith )కానీ ఈ సినిమాలోని రోల్ కు సూట్ అవుతారని ఆయన అన్నారు.స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయబోతున్నానని త్వరలో ఆ సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని విజయ్ ఆంటోని పేర్కొన్నారు.తాను నటించిన ఐదు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయని విజయ్ ఆంటోని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Telugu Ajith, Bichhagadu, Mahesh Babu, Tollwood, Vijay Antony-Movie

బిచ్చగాడు సినిమాకు బిచ్చగాడు2 సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదని హీరో పాత్ర బిచ్చగాడు కావడంతో బిచ్చగాడు2 అనే టైటిల్ పెట్టామని ఆయన తెలిపారు.బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తో ఈ మూవీ తెరకెక్కిందని ఆయన కామెంట్లు చేశారు.డైరెక్టర్ల కోణం నుంచి చూస్తే తాను గొప్ప నటుడిని కాదని విజయ్ ఆంటోని తెలిపారు.తాను సెన్సిటివ్ కాబట్టే సెంటిమెంట్ ప్రధానంగా ఉన్న సినిమాలను తెరకెక్కిస్తున్నానని విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు.

విజయ్ ఆంటోని వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.కెరీర్ విషయంలో విజయ్ ఆంటోని ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube