కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ (Thalapathy Vijay) జోసెఫ్ ఒకరు.ఈయన ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటాడు.
ఇక ఈ ఏడాది అప్పుడే వారిసు సినిమాతో ఫ్యాన్స్ ను అలరించాడు.ఇది కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఇక ఈ సినిమా రిలీజ్ కాగానే వెంటనే ఆలస్యం లేకుండా మరో సినిమాను పూర్తి చేస్తున్నాడు.

విజయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘లియో’( Leo ).భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ల బరిలో ఉంది.లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది.
ఈ సినిమాను అక్టోబర్ 19న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత విజయ్ నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడు అనే విషయం కోలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతుంది.విజయ్ కెరీర్ లో 68వ (Thalapathy 68)సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీకి చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.అయితే ఇంకా విజయ్ ఎవరి పేరు కన్ఫర్మ్ చేయకుండానే అప్పుడే షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
విజయ్ నెక్స్ట్ అయితే ఆగస్టు నుండి స్టార్ట్ చేసేయాలి అని చూస్తున్నారని లోకేష్ తో సినిమా ఇప్పటికే చివరికి చేరుకోవడంతో ఇది కాస్త పూర్తి కాగానే వెంటనే ఆగస్టు మూడవ వారం నుండి దళపతి స్టార్ట్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది.
మరి డైరెక్టర్ ను ఎప్పుడు ఫిక్స్ చేసి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారో చూడాలి.మరిన్ని వివరాలు త్వరలోనే రానున్నాయి.