భారత ప్రజాస్వామ్య చరిత్రలో అపురూప ఘట్టం చోటు చేసుకోబోతుంది.ఈ క్రమంలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
ఈనెల 28వ తేదీన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలుస్తోంది.ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంలో ఈ ప్రారంభోత్సవం జరగనుంది.
సెంట్రల్ విస్టాలో భాగంగా డిసెంబర్ 2020లో పార్లమెంట్ భవనానికి ప్రధాని మోదీ భూమి పూజ చేశారు.కాగా రెండున్నరేళ్ల లోపే కొత్త భవన నిర్మాణం పూర్తయింది.